చిరంజీవి సీనిమాలో ఆ సీన్ ను సరిగ్గా తీయలేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు చిరంజీవి.

అంతేకాకుండా దశాబ్ధాలుగా టాలీవుడ్‌కు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి( Chiranjeevi ).

ఇక ఆయన కెరియర్లు ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా మరికొన్ని ఫ్లాప్ గా కూడా నిలిచాయి.

90వ దశకంలో అయితే చిరంజీవి తన విశ్వరూపం చూపించారు.సినిమాల బడ్టెజ్, రెమ్యునరేషన్, వసూళ్ల పరంగా టాలీవుడ్ మార్కెట్‌ ను పెంచారు.

రూ.కోటి పారితోషికం తీసుకుని ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డులకెక్కారు.

1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్‌‌ లో చిరంజీవిపై ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాశారు.

కవర్ పేజీపై మెగాస్టార్ ఫోటో పెట్టి బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించారు.

అప్పట్లో భారతీయ సినీ పరిశ్రమను ఏలుతున్న అమితాబ్ బచ్చన్ సైతం ఒక్కో సినిమాకు కేవలం రూ.

90 లక్షలు మాత్రమే తీసుకునేవారు.చిరంజీవి తర్వాతే కమల్, రజినీ, అమితాబ్, షారుఖ్, సల్మాన్‌ ఖాన్‌లు నిలిచారంటే మెగాస్టార్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

"""/" / అయితే చిన్న తప్పు జరిగినా వందలాది మంది కష్టం,డబ్బు వృధా అవుతుందనేది మెగాస్టార్ అభిప్రాయం.

చిరులాగే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా సినిమాను తెరకెక్కించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

రోజూ ఫుటేజ్ చెక్ చేసుకోవడం, తప్పులెమైనా ఉంటే రీషూట్ చేయడం చేస్తుంటారు.సినిమాను శిల్పంలా చెక్కుతారు కాబట్టే రాజమౌళిని ఎన్టీఆర్ ముద్దుగా జక్కన్న అని పిలుస్తుంటారు.

సినిమాను అద్భుతంగా విశ్లేషించగల మేధావి రాజమౌళి( Rajamouli ).అందుకే ఆయన భారతదేశం గర్వపడే గొప్ప దర్శకుడయ్యారు.

ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాలోని ఒక సీన్‌ విషయంలో జక్కన్న అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొద్దిరోజుల క్రితం ఒక ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.నేను చిరంజీవికి పెద్ద అభిమానిని.

ఆయన నటించిన కొదమసింహ సినిమాలో రౌడీలు మెగాస్టార్‌ను పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు.

"""/" / ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన గుర్రం చిరంజీవి నోటికి తాడు అందించి కాపాడుతుంది.

ఆ సీన్‌ చూసి బాగా ఎమోషనల్ అయ్యాను.కానీ హీరోకి ఆ గుర్రానికి ఎలాంటి అటాచ్‌మెంట్ లేదనిపించిందని, మనకు సాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పకపోతే ఆ భావోద్వేగం ఎలా సంపూర్ణమవుతుందని రాజమౌళి ప్రశ్నించారు.

అందుకే ఈ సీన్ తనకు నిరుత్సాహం కలిగించిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.దీనిని బేస్ చేసుకునే మగధీర( Magadheera )లో ఇసుక ఊబిలో కూరుకుపోయిన హీరో బయటకు వచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగిలించుకుంటానని, ఓ మిత్రుడిలా దానిని చూస్తూ కృతజ్ఞతగా మాట్లాడతాడని ఆయన తెలిపారు.

పవిత్రమైన జలం అనుకుని తాగేశారు.. చివరికి అది ఏ వాటరో తెలిసి షాక్..?