S.S.Karthikeya :విమర్శకులకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన కార్తికేయ.. ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే అంటూ?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారు విమర్శలు గుప్పించేవారు కావాలని నెగిటివ్ గా కామెంట్స్ చేసే వారు ఎంతో మంది ఉన్నారు.
ఇటీవలే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించిన సమయంలో కూడా చాలామంది విమర్శలు గుప్పించిన సంగతి మనందరికీ తెలిసిందే.
కొందరు కావాలని పని కట్టుకుని మరి నెగిటివ్ కామెంట్స్ చేశారు.ఆస్కార్ అవార్డు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని, కొన్నారు అంటూ ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనేక రకాల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆర్ఆర్ఆర్ ( RRR )సినిమా లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ సమాధానం ఇచ్చారు.
"""/" /
కాగా ఎస్ ఎస్ కార్తికేయ( S.S.
Karthikeya ) ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు అన్న సంగతి మన అందరికి తెలిసిందే.
కార్తికేయ ఆ విషయాల గురించి స్పందిస్తూ.వివిధ భాషల్లో ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించిన తర్వాత అమెరికా లో జూన్ 1వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించాము.
థియేటర్ల వివరాలు సేకరించి ఒక్కరోజు 60 స్క్రీన్ లపై ప్రదర్శిద్దామనుకున్నాము.అప్పటికి ఐదు రోజుల ముందే మూవీ నెట్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలయ్యింది.
ఒకరోజు అనుకొని సినిమా విడుదల చేస్తే అలా నిల గడిచిపోయింది.నాన్ ఇండియన్స్ సినిమాను బాగా ఆదరించారు.
సాధారణంగా ఇండియన్స్ సినిమాలు అంటే పాటలు డాన్సులు ఉంటాయని హాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా అభిప్రాయపడుతూ ఉంటారు.
"""/" /
కానీ ఈ సినిమాలోని పాటలతో పాటు అద్భుతమైన హీరోయిజం కూడా ఉంది అని వాళ్ళు తెలిపారు.
సినిమా అయిపోయిన తర్వాత సినిమాలో మీకు ఏం నచ్చింది అని చాలామంది అభిప్రాయాలు అడిగాము.
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అన్నను ఎత్తుకుని ఫైట్ చేసే సీన్ బాగా నచ్చింది అని చెప్పే వాళ్ళు.
ఎన్టీఆర్, చరణ్, ప్రేమ్ రక్షిత్ రాహుల్, కాలభైరవ వీళ్ళు ఆస్కార్ కమిటీ ఆహ్వానితులు.
కీరవాణి బాబాయ్ చంద్రబోస్( M.M.
Keeravani ) కూడా నామినేషన్ లో ఉన్నారు అని తెలిపారు కార్తికేయ.కమిటీ పిలిచిన వాళ్ళు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు తప్పితే ప్రతి సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక బృందాలు ప్రతి ఒక్కరు కూడా టికెట్ కొనాల్సిందే.
అందుకోసం నామినేషన్స్ లో ఉన్నవారు ఆస్కార్ కమిటీకి మెయిల్ చేస్తే అందులో వివిధ రకాల క్లాసులు ఉంటాయి.
అలా మేము మెయిల్ చేస్తే తర్వాత మాకు రిప్లై ఇస్తూ లింకు పంపారు.
అలా మేము ఒక్కొక్క టికెట్ కి 1500 డాలర్లు పెట్టి కొన్నాము.నలుగురికి 750 డాలర్లు పెట్టి కొన్నాం ఇదంతా అధికారికంగానే జరిగింది అని తెలిపారు కార్తికేయ.
రోజుకో కప్పు కుంకుమపువ్వు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..?