Sruthi Shanmuga Priya :భర్త దూరమైన బాధలో ఉన్నాను.. నన్ను విసిగించకండి: నటి ఆవేదన

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు మరణిస్తూనే ఉన్నారు.

ఒకరు చనిపోయారు అన్న బాధ నుంచి తేరుకునే లోపే మరొక సెలబ్రెటీ మరణిస్తున్నారు.

కాగా కొందరు సెలబ్రిటీల మరణం( Celebrities Death )తో వారి కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి.

అంతేకాకుండా ఆ కుటుంబాలలో తీరని విషాదాలు మిగిలిపోతున్నాయి.ఇది ఇలా ఉంటే ఇటీవలే తమిళ బుల్లితెరకు చెందిన ఒక నటి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.

ఆ నటి మరెవరో కాదు శృతి షణ్ముగప్రియ. """/"/ మొదట నటస్వరం అనే సీరియల్‌‌తో బుల్లితెరకు పరిచయం అయిన నటి.

కాగా ఇటీవలె ఆమె భర్త అరవింద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.గత ఏడాది అరవింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది శృతి షణ్ముగప్రియ( Shruthi Shanmuga Priya ).

అంతకు ముందు ఈ జంట కొన్ని రోజులు డేటింగ్ చేశారు.ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు.

అయితే బాధలో ఉన్న షణ్ముగప్రియచాలా ఎమోషనల్ అవుతూ తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేసింది.

"""/"/ ఈ సందర్భంగా వీడియో( Emotional Video )లో ఆమె మాట్లాడుతూ.నేను జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను.

చాలా మంది నన్ను ఓదార్చేందుకు ఫోన్‌‌లు, మెసేజ్‌లు పంపిస్తున్నారు.వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఇలాంటి సమయంలో అన్నీ యూట్యూబ్ ఛానెల్స్ , మీడియా వారందరికీ దయతలచి చెప్తున్నాను.

నా భర్త గుండెపోటుతో చనిపోయిన విషయం మీకు తెలిసిందే.డాక్టర్లు కూడా వెల్లడించారు.

కానీ నిజం ఏంటో తెలియకుండా కొందరు ఆయన మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఇది పద్ధతి కాదు, ఇంట్లో అందరూ పుట్టెడు దుఃఖంలో ఉన్నాము.మీ వ్యూస్ కోసం, లైకుల కోసం మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

శృతి భర్త అరవింద్ గుండెపోటుతో మరణించగా కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం తప్పుగా ప్రచారం చేస్తూ ఏవేవో వార్తలను రాస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే షణ్ముగప్రియ సోషల్ మీడియా( Social Media )లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఒకవైపు చిన్న వయసులోనే భర్తని కోల్పోయి.షణ్ముగ అంత బాధలో ఉంటే ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం నిజంగా బాధాకరమైన విషయం అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు.

బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయా.. న్యాయ నిపుణులు చెప్పిన విషయాలివే!