శృతి హాసన్, రష్మిక దొందూ దొందే.. మీ టాలెంట్ కు చెత్త పాత్రలు అవసరమా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శృతి హాసన్, రష్మిక ముందువరసలో ఉంటారు.సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ పాత్రలు ఘోరంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పాటల కోసమే శృతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని కొంతమంది చెబుతున్నారు.
ఇలాంటి పాత్రల్లో నటిస్తే శృతి హాసన్ కెరీర్ ముగుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ తరహా పాత్రలకు శృతి హాసన్ దూరంగా ఉండాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల చొప్పున శృతి హాసన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
భారీ స్థాయిలో శృతి హాసన్ కు రెమ్యునరేషన్ అందుతున్నా శృతి తన స్థాయికి తగిన పాత్రల్లో నటించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/"/
శృతి హాసన్ ఇప్పటికైనా ఈ తరహా పాత్రలకు గుడ్ బై చెప్పాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
వారసుడు సినిమాలో రష్మిక పాత్రపై కూడా ఇదే తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో రష్మిక పాత్ర పాటలను తీసేస్తే 15 నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు.
అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో రష్మిక నటిస్తే మంచిదని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"""/"/
శృతి హాసన్, రష్మిక దొందూ దొందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.శృతి హాసన్, రష్మిక పాత్రల ఎంపికలో మారాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
శృతి హాసన్, రష్మిక ఒకప్పుడు మంచి పాత్రలను ఎంచుకున్నారని ఇప్పుడు మాత్రం సరైన పాత్రలను ఎంచుకోలేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సలార్ సినిమా శృతి హాసన్ భవిష్యత్తును డిసైడ్ చేయనుండగా పుష్ప2 సినిమాతో రష్మిక భవిష్యత్తు డిసైడ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.