నాపై కోపం తో మాట్లాడలేదు అనుకున్న.. ఏకంగా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు

మలయాళం, తమిళ సినిమాల్లో నటి శ్రీ విద్య( Srividya ) హీరోయిన్ గా రాణించిన సంగతి తెలిసిందే.

ఈ ముద్దుగుమ్మ 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 800 సినిమాల్లో నటించింది.అయితే ఆమె కెరీర్ లైఫ్‌కి ఎలాంటి ఢోకా లేదు కానీ పర్సనల్ లైఫ్ చాలా బాధాకరంగా సాగింది.

ఆమె బతికి ఉన్నప్పుడు "కమల్ హాసన్,( Kamal Haasan ) మీ మధ్య సాగిన లవ్ గురించి చెప్పండి" అని ఓ ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు.

దానికి ఆమె సమాధానం చెబుతూ " మలయాళ, తమిళ రెండు ఇండస్ట్రీలకు కూడా మా మధ్య లవ్ ఉందనే సంగతి తెలుసు.

ఇరువురు కుటుంబాలకు కూడా ఈ విషయం తెలిసింది.అందరూ మా ఇద్దరు పెళ్లి కావాలని అనుకున్నారు కానీ ఒకరోజు మా అమ్మ మా ఇద్దరినీ పిలిపించింది.

'కమల్ హాసన్ నువ్వు ఇండస్ట్రీలో చాలా పెద్ద ఆర్టిస్ట్ వి అవొచ్చు.ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా.

మా అమ్మాయికి కూడా మంచి టాలెంట్ ఉంది. """/" / ఆమె కూడా ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ కావొచ్చు.

' అని చెప్పింది.దాంతో కమల్ హాసన్‌కు బాగా కోపం వచ్చింది.

ఆ తర్వాత నాతో చాలా రోజులు మాట్లాడలేదు.కొంతకాలంలోనే కమల్ హాసన్ చాలా పెద్ద యాక్టర్ అయిపోయాడు.

అదే సమయంలో వేరే ఆవిడని కమల్‌ హాసన్ ప్రేమిస్తున్నప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది దాంతో నేను షాక్ అయిపోయా.

నా మైండ్ బ్లాంక్ అయిపోయింది.ఇక అతను నాకు ఎప్పటికీ దక్కడనే ఫీలింగ్‌ చాలా బాధ కలిగించింది.

" అని శ్రీవిద్య చెప్పుకొచ్చింది. """/" / శ్రీవిద్య కమల్‌హాసన్‌ కలిసి అన్నై వేలన్‌కణి,( Annai Velankanni ) అపూర్వ రాగంగల్‌( Apoorva Raagangal ) చిత్రాల్లో రొమాన్స్ చేశారు.

శ్రీవిద్య, కమల్ హాసన్ ప్రేమలో పడ్డారు కమల్ హాసన్ ఆమెకు ప్రపోజ్ చేశారు.

శ్రీవిద్య కూడా పెళ్లి చేసుకోవడానికి సై అన్నది.ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే పెళ్లి చేసుకోకుండా శ్రీవిద్య తల్లి వారిని అడ్డుకుంది.

కొన్నేళ్లకు కమల్ మరో నటి వాణీ గణపతిని( Vani Ganapathy ) ప్రేమించి పెళ్లి చేసుకోగా అది తెలిసి శ్రీ విద్యకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.

కొంతకాలం తర్వాత దర్శకుడు భరతన్‌తో లవ్ అఫైర్ పెట్టుకుంది.కానీ వారి బంధం కూడా ఎంతోకాలం సాగలేదు.

భరతన్ లలితను ఆమె మరొకసారి తీవ్రమైన బాధకు లోనైంది.మలయాళ మూవీ "టీక్కనల్‌" చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్‌ పరిచయమయ్యాడు అది కాస్త ప్రేమకు దారితీసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ కారణంగా జార్జ్ ఆమెను బలవంతం చేయడంతో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది.

1980లో వీళ్లు విడాకులు తీసుకున్నారు.అయితే జార్జ్ తన వద్ద నుంచి కాజేసిన డబ్బులను వెనక్కి తీసుకోవడానికి ఆమె సుప్రీం కోర్టుతో పోరాడాల్సి వచ్చింది.

చివరికి ఆమె తన సంపద తాను అందుకోగలిగింది.ఈమె 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా చనిపోయింది.

యవ్వనంగా కనిపిస్తున్న ఈమె వయసు తెలిస్తే షాకే.. ఆమె తినేది ఏంటంటే..?