తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నాలుగు మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి.ఈ మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు సుమారు ఐదు వేల మంది పోలీసుల పహారా నడుమ తిరుమల క్షేత్రం ఉండగా వీధుల్లో 1300 మంది విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

అంతేకాకుండా కొండపైకి ద్విచక్ర వాహనాలకు అధికారులు అనుమతి నిరాకరించారు.

రాజమౌళి మహేష్ బాబు సినిమా పాన్ వరల్డ్ లో వర్కౌట్ అవుతుందా..?