పుష్ప అప్డేట్.. 'శ్రీవల్లి' లిరికల్ సాంగ్..వావ్ అనిపిస్తుందిగా..!
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్, పోస్టర్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
ఇక ఈ మధ్యనే రష్మిక లుక్ కూడా రివీల్ చేసారు.ఈ సినిమాలో రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.
అల్లు అర్జున్ కు సరిగ్గా సరిపోయే మాస్ లుక్ లో రష్మిక లుక్ ప్రేక్షకులను అలరించింది.
ఇక తాజాగా ఈ రోజు పుష్ప నుండి మరొక సాంగ్ విడుదల అయ్యింది.
శ్రీవల్లి అనే సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.పాటను సిద్ శ్రీరామ్ ఆలపించడంతో ఈ పాట రేంజ్ పీక్స్ కు వెళ్ళింది.
"""/" /
సాంగ్ మొత్తం ఆద్యంతం అలరిస్తుంది.ఈ పాటలో అల్లు అర్జున్ ఎక్సప్రెషన్స్ గురించి మరొకసారి చెప్పుకోవాలి.
అతడి ఆటిట్యూడ్ మొత్తం ఈ పాటలో చాలా డిఫెరెంట్ గా ఉంది.చూపే బంగారామాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే'' అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
దేవి శ్రీ తన మ్యూజిక్ తో మరొకసారి మ్యాజిక్ చేసాడు. """/" /
చాలా రోజుల తర్వాత దేవి శ్రీ నుండి తన మార్క్ సాంగ్ వింటున్నట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఈ పాటను మేకర్స్ సరికొత్తగా మన ముందుకు తెచ్చారు.ఈ పాట చూసినంతసేపు లిరికల్ సాంగ్ అయినా కూడా వేరే లోకంలోకి వెళ్లి పోయినట్టు అనిపిస్తుంది.
మొత్తానికి సుకుమార్ ఈ సినిమాను ఎంత కొత్తగా ప్రెసెంట్ చేయబోతున్నాడో ఇలాంటి అప్డేట్ లు చూస్తేనే అర్ధం అవుతుంది.
ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న మన ముందుకు రాబోతుంది.
ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక రైలు .. ఏంటి దీని స్పెషాలిటీ?