వామ్మో.. ఆ సొరకాయ ధర కోటి రూపాయలట!

సాధారణంగా సొరకాయను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.వీటి ధర కిలో 30 నుంచి 20 రూపాయల దాకా పలుకుతోంది.

అలాంటిది ఇది ఒక్క సొరకాయ కోటి రూపాయలు అంటే ఎలా ఉంటుంది? వినడానికే నమ్మశక్యంగా లేదు అనిపిస్తుంది కదూ! అవును శ్రీశైలంలోని ఒక సొరకాయ ధర కోటి రూపాయలు పలికింది.

ఇంతకీ ఆ సొరకాయలోని స్పెషల్ ఏమిటి అనుకుంటున్నారా.! మన నమ్మకమే! మన నమ్మకాలను బలహీనతగా గుర్తించి కొందరు ముఠాలు చేసే దోపిడీ వల్ల ఆ సొరకాయ ధర కోటి రూపాయలు పలికింది.

కొంతమంది దోపిడీదారులు మనుషులకు మాయమాటలు చెప్పి వారిని మోసం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.

ఈ తరహాలోనే శ్రీశైలంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.

ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఓ అరుదైన ఘటన జరిగింది.

అక్కడికి వచ్చే భక్తులకు మాయమాటలు చెప్పి నాగస్వరం ఆకారంలో ఉన్న ఒక సొరకాయను కోటి రూపాయలకు అమ్ముకున్నారు.

ఆ సొరకాయ మన ఇంటిలో ఉండడం వల్ల సిరి సంపదలతో తులతూగుతారని, భక్తులకు మాయమాటలు చెప్పి వారికి ఈ సొరకాయలనమ్ముతున్నారు.

ఇది ఎంతో ప్రసిద్ధి చెందినవి, ఈ సొరకాయలు కేవలం నల్లమల అడవి ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయని, ఇవి చాలా శక్తివంతమైనవి అని మాయ మాటలు చెప్పి లక్షల్లో డబ్బును పోగు చేసుకుంటున్నారు.

ఒక వ్యక్తి ఏకంగా కోటి రెండు లక్షల రూపాయలకు ఆ సొరకాయ ను చివరకు వారు మోసపోయామని గ్రహించిన భక్తులు ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ దాదాపు 21 మందిని అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు.

ఈ ముఠాతో శ్రీశైలంలోని అన్నపూర్ణాదేవి ఆశ్రమ నిర్వాహకులకు సంబంధం ఉందని గుర్తించారు.అయితే ప్రస్తుతం ఆశ్రమ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్టు చేసిన వారిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర తెలిపారు.

ఈ సొరకాయల ఆకారం నాగస్వరం ఆకారంలో ఉండడం వల్ల ప్రజలు మోసపోయారని, ఇలాంటి విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రజలకు సూచించారు.

ఆర్య మూవీ లో ఈ షాట్ కోసం అల్లు అర్జున్ చేసిన పని తెలిస్తే ..?