దేవరతో ఓజీ పోటీ అంటే సాహసం అనే చెప్పాలి..వైరల్ అవుతున్న శ్రీరెడ్డి సంచలన ట్వీట్!

2024 సమ్మర్ కు బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమా( Devara Movie ) వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని ఇప్పటికే ప్రచారం జరిగింది.

2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమాకు పోటీగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా సమ్మర్ లోనే విడుదల కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

"""/" / అయితే శ్రీరెడ్డి దేవరతో ఓజీ పోటీ అంటే సాహసం అనే చెప్పాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

రెండు వారాల గ్యాప్ లో మొదట తమ్ముడు సినిమా బ్రో( Bro Movie ) విడుదలైందని తర్వాత చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) విడుదలైందని శ్రీరెడ్డి అన్నారు.

ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

ఎలాంటి పోటీ లేకుండానే ఈ రెండు సినిమాలు విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయని శ్రీరెడ్డి( Srireddy ) అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలు ఇలా ఫ్లాప్ అయ్యాయంటే ఓజీ మూవీ దేవరతో పోటీ అంటే సాహసం అనే చెప్పాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీరెడ్డి కామెంట్లను మెగా ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. """/" / ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన మెగా హీరోలను తక్కువగా అంచనా వేయొద్దని ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీపై ద్వేషంతో విషం కక్కుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు.అక్కడ పలు ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

శ్రీరెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.శ్రీరెడ్డి కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

మెగా ఫ్యామిలీకి దక్కిన సంచలన రికార్డ్ ఇదే.. ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేరుగా!