నిహారిక విడాకుల విషయంలో నాగబాబును టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి?
TeluguStop.com
మెగా డాటర్ నిహారిక ( Niharika )విడాకుల గురించి అధికారిక ప్రకటన చేశారు.
నేను చైతన్య ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోబోతున్న అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
దీంతో నిహారిక గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా నిహారిక విడాకుల ( Divorce ) ప్రకటన చేయడంతో ఎంతోమంది ఈమె విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అదేవిధంగానిహారిక విడాకుల విషయం గురించి ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ( Sri Reddy )మాట్లాడుతూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/07/Sri-Reddy-targeted-Nagababu-daughter-orce-matterc!--jpg" /
నిహారిక విడాకుల ప్రకటన చేయగానే శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా నాగబాబును ( Nagababu ) టార్గెట్ చేస్తూ బండ బూతులతో రెచ్చిపోయారు.
గతంలో శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మెగా ఫ్యామిలీకి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యంగా నాగబాబుని టార్గెట్ చేస్తూ ఒకప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి నన్ను తిట్టావు.
నిన్ను శ్రీరెడ్డి ఏమీ చేయలేకపోయింది.కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అది నీకు ఇప్పుడు తిరిగి ఫలితాన్ని అందించింది అంటూ ఈమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/07/Sri-Reddy-targeted-Nagababu-daughter-orce-matterd!--jpg" /
నాగబాబు రాజకీయాలలో నీతులు చెబుతాడు కూతురిని ఎలా పెంచాలో తెలియదా అంటూ ప్రశ్నించారు.
ఇలా కూతురినే కంట్రోల్ పెట్టుకోలేనటువంటి వ్యక్తి రాజకీయాలలోకి వచ్చే ప్రజలకు ఏం చేస్తారని ఈమె ప్రశ్నించారు.
ఆ నిహారిక తనకే పెళ్లి అయినట్టు పెద్ద బిల్డప్ కొట్టింది.కానీ ఇప్పుడు విడిపోయాక మాత్రం బరితెగించి తిరుగుతోంది.
ఆమెకు అసలు మొగుడంటే లెక్కనే లేదు.ఆ మెగా కూతుర్లందరికీ ఇలానే పొగరు ఎక్కువ.
భర్తలను అస్సలు పట్టించుకోరు అంటూ ఈమె మెగా ఫ్యామిలీ ఆడపడుచులు అందరిని కూడా ఈ సందర్భంగా టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫైర్ యాక్సిడెంట్ స్థలాన్ని పరిశీలించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫిసర్ శ్రీనివాస రెడ్డి