సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ లో శ్రీపాద రావు జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : దుద్దిల్ల శ్రీపాద రావు గారి( Sripada Rao ) జయంతి సందర్భంగా శనివారం 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్( Sardapur ) నందు బెటాలియన్ కమాండెంట్ యస్.

శ్రీనివాస రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కమాండెంట్ యస్.

శ్రీనివాస రావు మాట్లాడుతూ 1935 సంవత్సరములో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందినా మౌళి పటేల్ రాధాకిష్టయ్య, కమలా బాయి దంపతులకు ఆయన జన్మించారు.

కొన్ని రోజుల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చేయాలని ప్రజలు ఒత్తిడిచేశారు.

నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాద రాజకీయాల్లోకి అడుగిడాలని స్నేహితులు, హితులు ప్రోత్సహించారు.

ఆ దిశగా అడుగులు వేస్తూ పోటి చేసి మొదటిసారి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు.

వరుసగా మరో మారు ఆయనకే ప్రజలు మద్దతు పలకడంతో రెండవ సారి కూడ ఎన్నికయ్యారు.

మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎల్ ఎం బి ఛైర్మన్ పదవికి మంథని నుండి గెలిచారు.

ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎల్ ఎం బి బ్యాంకు ఛైర్మన్ ఎన్నిక ఎంతో సహకరించింది.

దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమైనాడు.పదవివస్తే ముఖంచాటు చేసుకునే నాయకులకు భిన్నంగా అయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, నష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగారు.

1984 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఏమ్మెల్యే గా పోటి చేసే అవకాశం లభించింది.

ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు విజయం సాధించారు.ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులుగా ఎన్నికైన ఆయనకు శాసనసభ స్పీకర్ గా అన్ని పార్టీల మద్దతుతో పదవి నదిష్టించారు.

మంథని ప్రాంతంలో అభివృద్ధి పరిమళాల పరంపర ప్రారంభం అయింది అంటే శ్రీపాద రావు స్పీకర్ ఉన్న సమయంలోనే అని చెప్పుకోవచ్చు.

ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించింది.

 1999 ఏప్రిల్ 13 న మహాదేవపూర్ మంలం అన్నారంకు తన అనుచర వర్గంతో వెళ్లివస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి కరుకు తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారు.

అయన మరణించిన ఇప్పటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.విధాత ఆ ఉన్నత ప్రజా నాయకునికి హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస్ రావు ,ఆర్.

ఐ.రఘునాథన్, నారాయణా, నేమజి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇ.

ప్రమీల,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వీడియో: గుండెపోటుతో మరొకరు మృతి.. కార్డియో చేస్తూ కుప్పకూలాడు..