శ్రీకాళహస్తి దేవస్థానం నుండి దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
TeluguStop.com
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని.దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో కెవి సాగర్ బాబుతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్, ఈ.వోలు కలిసి అమ్మవారి పేరున కనకదుర్గమ్మ ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి దసరా శరన్నవరాత్రుల సమయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్తాలను అందజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా శ్రీకాళహస్తి ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సమయంలో శ్రీకాళహస్తి డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కె.
అయ్యన్న, ఆలయ కమిటీ సభ్యులు మున్నా రాయల్, జయ శాయ్యంరాయల్, సునీత, రమాప్రభ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
దేవర మూవీ సక్సెస్ సాధిస్తే ఎన్టీయార్ కంటే కొరటాల శివ కే ఎక్కువ పేరు వస్తుందా..?