తిరుపతికి మణిహారంగా శ్రీనివాససేతు ఫ్లైఓవర్
TeluguStop.com
తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు.
తిరుపతికి మణిహారంగా నిలవనున్న ఈ శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ను తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా ప్రాజెక్టును పూర్తి చేసింది.
కాగా శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలను తెర పడనుంది.
శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లు కాగా దీని పొడవు సుమారు 7.
34 కిలోమీటర్లుగా ఉంది.2019 మార్చిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా ఫ్లైఓవర్ నిర్మాణంలో టీటీడీ రూ.
458 కోట్లు ఖర్చు చేసిందని తెలుస్తోంది.