కరోనా 90 శాతం మందికి చెడు చేసినా నాకు మంచే జరిగింది.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్న నటులలో శ్రీనివాస్ భోగిరెడ్డి ఒకరు.

శ్రీనివాస్ భోగిరెడ్డి రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ప్రముఖ నటుడు శ్రీనివాస్ భోగిరెడ్డి ( Srinivas Bhogireddy )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు.

రిటైర్మెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టానని ఆయన కామెంట్లు చేశారు.నా వయస్సు ప్రస్తుతం 61 సంవత్సరాలు అని ఆయన తెలిపారు.

హీరోయిన్లకు ఫాదర్ రోల్స్ లో ఎక్కువగా నటించానని శ్రీనివాస్ వెల్లడించారు.నాకు ముగ్గురు బ్రదర్స్ అని ఆయన కామెంట్లు చేశారు.

నాకు కూతురు పుట్టాలని కోరుకుని కూతురుని కన్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు.హీరోలు, హీరోయిన్లతో సినిమాలు చేస్తే నా కొడుకు, కూతురు గుర్తుకు వస్తారని శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

"""/" / కాలానుగుణంగా మనం కూడా మారాలని ఆయన పేర్కొన్నారు.మారుతి గారిని కలవాలని 6 నెలల నుంచి ట్రై చేయగా రాజా డీలక్స్ కోసం కలిశానని శ్రీనివాస్ వెల్లడించారు.

రాజాడీలక్స్ సినిమాలో ఒక్కరోజు పాత్ర కోసం చేశానని ఆయన పేర్కొన్నారు.నేను చేసిన చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉందని శ్రీనివాస్ కామెంట్లు చేశారు.

కరోనా 90 శాతం నష్టాన్ని కలిగిస్తే నాకు మాత్రం మేలు జరిగిందని ఆయన తెలిపారు.

"""/" / రాజావారు రాణివారు, ఓ పిట్టకథ సినిమాల వల్ల కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని శ్రీనివాస్ అన్నారు.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో శ్రీలీల బాబాయ్ గా చేశానని ఆయన తెలిపారు.

శ్రీనివాస్ భోగిరెడ్డి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.శ్రీనివాస్ భోగిరెడ్డి భగవంత్ కేసరి సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

శ్రీనివాస్ భోగిరెడ్డి చాలా సంవత్సరాల క్రితం సీరియళ్లను నిర్మించగా ఆ సీరియళ్లు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్ల ధరలు చూస్తే కళ్లు చెదిరిపోతాయి.. స్టార్టింగ్ ప్రైస్ 56 వేలట..?