కొరియోగ్రాఫర్ యశ్ తో కలసి రొమాంటిక్ పర్ఫార్మెన్స్ చేసిన శ్రీముఖి... యశ్ భార్య రియాక్షన్ ఇదే!

సాధారణంగా ఎన్నో మీడియా సంస్థలు,బుల్లితెర చానల్స్ ప్రతి ఏడాది పెద్దఎత్తున వార్షికోత్సవాలను జరుపుకోవడం మనం చూస్తుంటాము.

ఈ క్రమంలోనే ఆ చానల్ లో ప్రసారమయ్యే టీవీ నటీనటులు అలాగే ఇతర షోలలో నటించే నటీనటులు పెద్ద ఎత్తున ఆటపాటలతో డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జీ టీవీ 17వ యానివర్సరీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోనుంది.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటీనటులు అందరూ ఒకే వేదికపై చేసిన హంగామా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎంతోమంది నటీనటులు వేదికపై డ్యాన్సులు చేస్తూ అందరిని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీముఖి వ్యవహరించారు.ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో శ్రీముఖి యాంకరింగ్ చేయడమే కాకుండా, కొరియోగ్రాఫర్ యశ్ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు.

"""/" / ఇక వీరిద్దరూ కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి యశ్ భార్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే మరొక టీవీ నటుడు కల్పించుకొని చెల్లెమ్మా టెన్షన్ పడకు మీ ఆయన నిప్పు అని చెప్పడంతో యశ్ భార్య కూల్ అయ్యారు.

అయితే ఇదంతా కూడా కేవలం సరదా కోసం మాత్రమేనని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్యకు అలాంటి జబ్బు ఉందా.. ఇటలీలో పెళ్లయిన ఆ పని అందుకే చేయలేదా?