సీనియర్ హీరోయిన్లను ఫాలో అవుతున్న శ్రీ లీల.. పెద్ద ప్లానింగే

యువ నటి శ్రీలీల( Sreeleela ) పెళ్లి సందD, ధమాకా (2022) సినిమాలతో తెలుగులో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత పలువురు బడా హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.ఏ పండగ వచ్చినా శ్రీలీల సినిమా ఉండాల్సిందే అన్న చందాన పరిస్థితి మారింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రాబిన్‌హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఆర్‌టీ75 వంటి సినిమాల్లో నటిస్తోంది.

వాటికి చాలా రోజుల క్రితమే ఈ తార సైన్ చేసింది.కొత్తగా ఈ క్యూట్ బ్యూటీ తెలుగులో ఏ సినిమాకి సంతకం చేయలేదు.

బ్రేక్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పంచదార బొమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి జంప్‌ చేయాలని ప్లాన్ చేస్తుందట.

ఆమె ఒక హిందీ ఫిలిం కి సైన్ చేసిందని ప్రచారం జరుగుతోంది.ఇది అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కాబోతోంది.

"""/" / శ్రీలీల హీరోయిన్ కృతి శెట్టి ( Krithi Shetty )అడుగుజాడల్లో నడుస్తుందని కూడా అంటున్నారు.

కృతి శెట్టి "ఉప్పెన" సినిమాతో చాలా పెద్ద విజయం సాధించింది.దాని తర్వాత ఆమెకు ఫ్లాప్స్ వచ్చాయి.

వెంటనే ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లోకి వెళ్లిపోయింది.అక్కడ ఆమెకు లెక్కలేనన్ని అవకాశాలు వస్తున్నాయి.

కృతి శెట్టి( Krithi Shetty ) కూడా అలాగే వేరే ఇండస్ట్రీకి వెళ్లిపోయి మంచి అవకాశాలతో బిజీగా కెరీర్ లైఫ్ గడపాలని భావిస్తోంది.

కోలీవుడ్ లో కూడా ఆఫర్లను ఆమె లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. """/" / రష్మిక మంద(Rashmika Mandann )న్న తక్కువ వయసులోనే బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సక్సెస్ అయ్యింది.

ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసింది.

శ్రీలీల కూడా తన పాపులారిటీ పెంచుకోవాలని భావిస్తోంది.2023, 2024 మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం ఏ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అతిపెద్ద ఫ్యాన్స్ అందుకుంది.

సినిమా కథ బాగుందా లేదా అని చూసుకోకుండా ఆమె అన్నిటికీ సంతకం చేసుకుంటూ వెళ్ళింది.

దానివల్ల ఇప్పుడు ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చే పరిస్థితి ఎదురయింది.

అందుకే తెలుగు సినిమాల నుంచి ఆమె కాస్త బ్రేక్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.మిగతా ఇండస్ట్రీలపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది.

కోలీవుడ్ హిందీలో ఆమెకు విజయాలు వస్తే మళ్లీ ఫామ్‌ లోకి వస్తానని చెప్పుకోవచ్చు.

తలస్నానం చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ ను పాటిస్తే మీ జుట్టు సిల్కీగా, షైనీగా మెరిసిపోవడం ఖాయం!