లంక,ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్....3 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది
TeluguStop.com
ప్రపంచ కప్ లో ఈ రోజు శ్రీలంక,ఇంగ్లాండ్ జట్లమధ్య మ్యాచ్ ప్రారంభమైంది.ఈ పోరు లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగడం తో ఇంగ్లాండ్ బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించారు.
ఈ టోర్నియే సెమీస్ కు చేరాలి అంటే తప్పకుండా తమ చివరి నాలుగు మ్యాచుల్లో గెలవాల్సి ఉన్న లంక జట్టు ఇంగ్లాండ్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో మరోసారి అదే ఆటతీరు ప్రదర్శించింది.
లంక బ్యాట్స్ మేన్స్ ఆట తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం తో కేవలం మూడు పరుగులకే రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది.
ఇలాంటి కీలక మైన మ్యాచ్ లో ముందుగా సంయమనంతో ఆడి కుదురుకున్నాక వేగంగా ఆడాల్సి ఉండగా లంక జట్టు మాత్రం ఆరంభంలోనే చెత్తషాట్లతో కెప్టెన్ దిముత్ కరుణరత్నె(1), కుశాల్ పెరీరా(2) వికెట్లు పోగొట్టుకున్నారు.
"""/"/
ఆతిథ్య పేసర్లు జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు.
5 ఓవర్లు ముగిసేసరికి లంక రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది.
కుశాల్ మెండీస్(1), అవిష్క ఫెర్నాండో(6) ప్రస్తుతం క్రీజులో ఉండగా లంక జట్టు స్కోర్ బోర్డు కోసం కష్టపడుతుంది.
అరుదైన ఘటన.. ఒకేసారి ఆరుగురు సోదరులు, సోదరీమణులు వివాహం