చిరంజీవి అభిమానులు పిచ్చ తిట్లు తిట్టారు.. శ్రీలక్ష్మి కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి శ్రీలక్ష్మి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో తాను ఎక్కువగా నటించానని శ్రీ లక్ష్మి చెప్పుకొచ్చారు.

ఇ.వి.

వి.సత్యనారాయణ డైరెక్షన్ లో చెవిలో పువ్వు, జంబ లకిడి పంబ సినిమాలో తాను నటించానని ఆమె కామెంట్లు చేశారు.

ఆయన డైరెక్షన్ లో తర్వాత నటించి ఉంటే నేను ఎక్కడో ఉండేదానినని ఆమె తెలిపారు.

రేలంగి నరసింహారావు అందరికీ గౌరవం ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు.మావిచిగురు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టిందని శ్రీలక్ష్మి కామెంట్లు చేశారు.

ఆ సీన్ లో బ్రహ్మానందం బాబు మోహన్ ను పిచ్చికొట్టుడు కొట్టారని ఆమె వెల్లడించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి గారు పేపర్ లో బొమ్మలతో సహా రాసుకుని షూట్ చేస్తారని ఆమె తెలిపారు.

అప్పటి కామెడీ సీన్లను చూసి ఇప్పుడు కూడా నవ్వుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఈతరం డైరెక్టర్లు నాకు ఎక్కువగా ఛాన్స్ లు ఇవ్వడం లేదని ఆమె అన్నారు.

ఏ నిర్మాత విషయంలో కూడా నేను కఠినంగా వ్యవహరించలేదని ఆమె చెప్పుకొచ్చారు.మనల్ని బట్టి నిర్మాతలు ఉంటారని ఆమె శ్రీలక్ష్మి వెల్లడించారు.

పదేళ్ల గ్యాప్ గురించి శ్రీలక్ష్మి స్పందిస్తూ నేను వ్యక్తిగత జీవితం కోసం గ్యాప్ తీసుకున్నానని ఆమె తెలిపారు.

ఆ గ్యాప్ ను నేను భర్తీ చేసుకోగలిగానని ఆమె చెప్పుకొచ్చారు. """/"/ రిలాక్సేషన్ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె చెప్పుకొచ్చారు.

చిరంజీవి గారి విజేత సినిమాలో నేను నటించానని ఆమె తెలిపారు.ఆ సినిమాలో చిరంజీవిని చెప్పు కుట్టి తీసుకురమ్మని చెప్పగా చిరంజీవి అభిమానులు నన్ను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారని శ్రీలక్ష్మి తెలిపారు.

ఇంకోసారి అలాంటి పనులు చేయొద్దని నాకు చిరంజీవి ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారని ఆమె కామెంట్లు చేశారు.

బుచ్చిబాబు రామ్ చరణ్ షూట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?