బాలయ్యతో కలిసి నటించాలనే కోరిక ఉందని 12 ఏళ్ళ క్రితమే చెప్పిన శ్రీకాంత్.. ఆ కల ఇప్పుడు అఖండతో?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటుడు శ్రీకాంత్.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈయన ఒక నటుడుగానే కాకుండా నిర్మాత కూడా బాధ్యతలు చేపట్టాడు.ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఒక సభ్యుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

ఈయన మరో నటి ఊహను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా ఉంది.

ఈయన తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాతో పరిచయమయ్యాడు.

ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వటంతో అదే ఏడాది వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

ఆ తర్వాత తాజ్ మహల్, ఎగిరే పావురమా, ప్రేయసి రావే, ఆహ్వానం, ఆమె, పెళ్లి సందడి, ఉయ్యాల, పెళ్ళాం ఊరెళితే ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.

"""/"/ దాదాపు 125 సినిమాలలో నటించాడు శ్రీకాంత్.ఈయన సెకండ్ హీరోగా కూడా పలు సినిమాలలో నటించాడు.

ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలోనే నటించాడు.ఇక ఈ మధ్య నెగిటివ్ పాత్రలలో కూడా నటిస్తున్నాడు.

కానీ అంత సక్సెస్ కాలేకపోతున్నాడు.ఇదిలా ఉంటే శ్రీకాంత్ కు బాలయ్యతో నటించాలన్న కోరిక ఉందని 12 సంవత్సరాల కిందటనే తెలిపాడు.

"""/"/ ఆయన 2009లో నటించిన సినిమా మహాత్మ.ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది.

ఇక ఈ సినిమా విడుదల సమయంలో తనకు బాలయ్య తో నటించాలని కోరిక ఉందని తెలిపాడు.

మొత్తానికి ఆ కోరిక 12 ఏళ్లకు తీరింది.ఇంతకు అదే సినిమానో కాదు అఖండ.

తాజాగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని థియేటర్ లో బాగా సందడి చేస్తుంది.

"""/"/ బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో మరోసారి తెరపైకి వచ్చిన సినిమా అఖండ.

ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అయ్యి సెన్సేషనల్ గా మారింది.ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఇందులో జగపతిబాబు తో పాటు శ్రీకాంత్ కూడా విలన్ పాత్రలో నటించాడు.

నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు శ్రీకాంత్ పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

కానీ సినిమా హిట్టయినా శ్రీకాంత్ పాత్ర మాత్రం హిట్ కాలేక పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి శ్రీకాంత్ విలన్ గా మెప్పించలేకపోయాడని తెలుస్తుంది.ఎంతో కాలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హీరోగా కొనసాగిన శ్రీకాంత్ విలన్ గా అంతగా సెట్ అవ్వలేకపోయాడు.

ఎవరు కూడా శ్రీకాంత్ పాత్ర గురించి అంతగా మాట్లాడుకోలేకపోతున్నారు.మొత్తానికి బాలయ్యతో నటించిన అవకాశం దక్కింది కానీ విలన్ గా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు శ్రీకాంత్.

మరి ఇకనైనా శ్రీకాంత్ విలన్ గా కొనసాగుతాడో లేదో చూడాలి.

ఐపీఎల్ 2024: సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతున్న బ్యాటర్లకు కళ్లెం వేస్తున్న టాప్ బౌలర్లు వీళ్లే..??