కేసీఆర్ పాత్రలో కనిపించబోతున్న శ్రీ కాంత్

విలన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శ్రీకాంత్.

ప్రస్తుతం కెరియర్ లో హీరో పాత్రల నుంచి టర్న్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీ అయ్యే ప్రయత్నంలో శ్రీకాంత్ ఉన్నాడు.

డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ఎంపిక చేసుకుంటూ కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.బోయపాటి, బాలకృష్ణ మూవీలో విలన్ గా శ్రీకాంత్ నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో డిఫరెంట్ కంటెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తెలంగాణ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే పేరు కేసీఆర్.ఇప్పుడు ఆ కేసీఆర్ బయోపిక్ కథనంతో తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్ ని శ్రీకాంత్ పోషించాడు.

మ్యాక్స్‌ ల్యాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై మహముద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాణంలో తెలంగాణ దేవుడు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది.

వడత్య హరీష్‌ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.శ్రీకాంత్‌ తో పాటు సంగీత, జిషాన్‌ ఉస్మాన్‌, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, బ్రహ్మాజీ, మధుమిత ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది.షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడానికి ఒక ఉద్యమధీరుడు ఎలాంటి పోరాటం చేశాడు, ప్రజల కష్టాల్ని ఎలా తీర్చాడన్న ఇతివృత్తంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలిపాడు.

తెలంగాణ ఉద్యమాన్ని ఈ సినిమాలో ముఖ్యంగా ప్రస్తావించనున్నట్లు స్పష్టం చేశారు.

జీవితం ఫర్ఫెక్ట్ గా లేదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు.. పవిత్రతో గొడవలే కారణమా?