పార్ట్ 1 ఫ్లాప్ అవ్వడంతో సెకండ్ పార్ట్ ని అటకెక్కించిన దర్శకుడు
TeluguStop.com
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా వంటి విభిన్న చిత్రాలు రూపొందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
ఈయన దర్శకత్వం లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా( Brahmotsava ) నిరాశ పరిచింది.
హీరోగా మహేష్ బాబు ని పెట్టుకుని కథ అక్కర్లేదు అనుకున్నాడేమో కానీ శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమా తో డిజాస్టర్ ను చవి చూడటం జరిగింది.
ఆ దెబ్బ తో శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) కెరీర్ ఖతం అయినట్లే అని అంతా భావించారు.
కానీ శ్రీకాంత్ అడ్డాల తిరిగి పుంజుకున్నాడు.వెంకటేష్ తో నారాప్ప అనే సినిమా ను తీశాడు.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.ఆ వెంటనే కొత్త వారితో పెదకాపు అనే సినిమా ను మొదలు పెట్టాడు.
"""/" /
సినిమా షూటింగ్ సగం పూర్తి అయిన తర్వాత ఇది రెండు పార్ట్ లుగా వస్తే బాగుంటుందని భావించాడు.
అందుకే తాజాగా పెదకాపు 1( Peddha Kapu 1 ) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
ముందుగా అనుకున్న ప్రకారం అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో పెదకాపు 2 ను విడుదల చేయాల్సి ఉంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండో భాగం రాకపోవచ్చు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఒక యంగ్ హీరో కు శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పాడని.త్వరలోనే ఆ హీరో నుంచి క్లారిటీ వస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి.
"""/" /
ఒక వేళ ఆ హీరో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తప్పకుండా వచ్చే ఏడాది లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేంత ఉత్సాహంగా శ్రీకాంత్ అడ్డాల కనిపిస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఏమాత్రం ఆశా జనకంగా లేదు.
కనుక ఆ హీరో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ఒక వేళ శ్రీకాంత్ అడ్డాలకు ఆ హీరో ఓకే చెప్తే గొప్ప విషయమే.
ఏ విషయం అయినది రెండు మూడు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.