శ్రీకాళహస్తి గుడి దర్శనం అయ్యాక ఏ గుడికి వెళ్ళకూడదు...ఎందుకు?

తిరుమల తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు దాదాపుగా శ్రీకాళహస్తి వెళ్లి పరం శివుణ్ణి దర్శించుకుంటారు.

అలాగే అక్కడ రాహు కేతువులకు పూజ చేయించుకొని ఇంటికి వస్తూ ఉంటారు.అయితే కొంత మంది శ్రీకాళహస్తి దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళుతూ ఉంటారు.

ఆలా వెళ్ళటం తప్పని అంటున్నారు పండితులు.అసలు శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్ళాక మరొక గుడిలోకి వెళ్లకూడదని ఎందుకు అంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ విశాల విశ్వము గాలి,నింగి,నేల,నీరు,నిప్పు అనే పంచభూతాల నిలయంగా ఉంది.ఆ పంచ భూతాలు భూమి మీద పంచ భూత లింగాలుగా వెలిసాయి.

వాటిలో వాయు లింగంగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసింది.ఈ ఆలయంలో దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళ్లకూడదని ఒక నియమం ఉంది.

అయితే ఆ నియమం వెనక ఒక పరమార్ధం కూడా ఉంది.శ్రీ‌కాళ‌హ‌స్తిలోని సుబ్ర‌మ‌ణ్య స్వామి ద‌ర్శ‌నంతో ఏవైనా స‌ర్ప‌ దోషాలు ఉంటే తొలగిపోతాయి.

ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్ళాలి.ఎందుకంటే శ్రీ‌కాళ‌హ‌స్తిలో పాపాల‌ను వ‌దిలేసి ఇంటికి వెళితేనే దోష నివారణ జరుగుతుంది.

తిరిగి ఏ దేవాలయానికి వెళ్లిన దోష నివారణ జరగదని అంటూ ఉంటారు.గ్ర‌హ‌ణాలు.

శ‌ని బాధ‌లు.ప‌ర‌మ‌శివుడుకి ఉండ‌వ‌ని.

మిగితా అంద‌రి దేవుళ్ల‌కి శ‌ని ప్ర‌భావం.గ్ర‌హ‌ణ ప్ర‌భావం ఉంటుంద‌ని చెపుతున్నారు.

గ్ర‌హ‌ణ స‌మ‌యంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రమే తెరిచి ఉంటుంది.అలాగే పూజలు కూడా జరుగుతూ ఉంటాయి.