సృజన స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి:బీసీ విద్యార్థి సంఘం
TeluguStop.com
అధిక ఫీజులు వసూలు చేస్తున్న సృజన స్కూల్ ( Srijana School )గుర్తింపును రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం ( BC Student Union )సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగ యాదవ్( Linga Yadav ) డిమాండ్ చేశారు.
శనివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్ లోని సృజన స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివిస్తుంటే ఎన్ఐటి, నీట్,ఐఐటి,ఒలంపియాడ్ పేరుతోనే కాకుండా, పలురకాల ఫీజుల పేరుతో దోపిడి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
.
విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే సూర్యాపేటలోని పలు పాఠశాలలు అధిక ఫీజులు వసూళ్ళకు పాల్పడుతున్నాయని, అలాంటి పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున నిరంతరం పోరాటం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాళోజి మహేష్,కడియం వంశీ, తండు నగేష్,అంజన్ యాదవ్,జై చంద్ర తదితరులు పాల్గొన్నారు.
వింటర్ లో జలుబు వదలట్లేదా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!