చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా తిరుమల లో మొక్కులు తీర్చుకున్న శ్రీధర్ వర్మ..

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu )కి, తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ కోరారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద, చంద్రబాబు నాయుడి 75 జన్మదినం సందర్భంగా తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ( Sridhar Verma ) ఆధ్వర్యంలో 750 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కులు తీసుకొని ఆనవాయితీగా వస్తోందన్నారు.

75 సంవత్సరాల సందర్భంగా 750 టెంకాయలు కొట్టిచంద్రబాబు నాయుడుకి శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

పిజ్జాల మీద రూ.12.5 లక్షలు ఖర్చుపెడతాడు.. రూ.8 కోట్లు సంపాదిస్తాడు.. ఎలా అంటే…??