శ్రీదేవి సోడా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక దూకుడే ఆలస్యం!

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే జనాల్లో అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌తో, ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు సాంపిల్ చూపెట్టాడు దర్శకుడు కరుణ కుమార్.

పలాస్ చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా ముగించేస్తుంది చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది.శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపారు.

అంతేగాక ఇలాంటి సినిమాలు కేవలం డ్రామానే కాకుండా మంచి సోషల్ మెసేజ్‌లు కూడా ఇస్తుండటం సంతోషకరంగా ఉందని వారు తెలిపారు.

మొత్తానికి శ్రీదేవి సోడా సెంటర్‌కు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరింత ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు.

ఇక ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే లవ్ స్టోరీతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్ బెస్ట్‌గా ఉండబోతుందని, అలాగే ఈ సినిమాతో హీరోయిన్ ఆనంది టాలీవుడ్‌లో ఖచ్చితంగా బిజీ హీరోయిన్‌గా మారుతుందని చిత్ర యూనిట్ పిచ్చ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

మరి శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఆగస్టు 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఏకంగా 5 రోజుల పాటు ఎవరికి మొహం చూపించుకోలేక ఇంట్లోనే ఉన్న శోభన్ బాబు..!