Sridevi NTR : ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ ఇచ్చేటప్పుడు శ్రీదేవితో రాఘవేంద్రరావు ఏమన్నాడో తెలుసా…?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్‌గా బిరుదు దక్కించుకున్న నటి శ్రీదేవి( Sridevi ).

ఈ అతిలోకసుందరి 50 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించి భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది.

ఈమె సినిమా ఇండస్ట్రీకి అందించిన కాంట్రిబ్యూషన్స్‌ ను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

సిల్వర్ స్క్రీన్ పై చాలా యాక్టివ్‌గా, ఔట్ స్పోకెన్‌గా కనిపించే శ్రీదేవి ఆఫ్‌స్క్రీన్‌లో మాత్రం చాలా సిగ్గు, బిడియంతో ఉండేది.

పెద్దగా ఎవరితోనూ మాట్లాడేది కాదు.అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకునేది.

ఓసారి ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుతో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి వెల్లడించింది.ఆ ఇంటర్వ్యూకుసంబంధించిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"""/" / ఆ వీడియో క్లిప్ లో శ్రీదేవి మాట్లాడుతూ."రాఘవేంద్రరావు ( Kovelamudi Raghavendra Rao )డైరెక్షన్‌లో పనిచేయడం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.

ఆయన డైరెక్షన్‌లో పని చేసిన ప్రతి హీరోయిన్ ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయింది.

నేను ఆయనతో చేసిన ప్రతి సినిమా, ప్రతి సాంగ్ హిట్ అయింది.నేను, రాఘవేంద్రరావు కలిసి చేసిన తొలి సినిమా పదహారేళ్ల వయసు( Padaharella Vayasu ).

ఈ సినిమా చేసిన చాలా రోజుల తర్వాత ఒకరోజు రాఘవేంద్రరావు నా దగ్గరికి వచ్చి ' నీకు ఇప్పుడు నేను ఒక చాలా పెద్ద షాకింగ్ న్యూస్ చెప్తున్నాను.

మనిద్దరం కలిసి మళ్ళీ పని చేయబోతున్నాం.' అని అన్నాడు.

మళ్లీ మనం కలిసి పనిచేస్తే అది షాకింగ్ న్యూస్ ఎందుకు అవుతుంది సార్, ఇది చాలా మంచి న్యూస్ అవుతుంది అని నేను నవ్వేశాను.

" """/" / "అప్పుడు రాఘవేంద్రరావు కలగజేసుకొని 'లేదు లేదు ఈసారి నువ్వు చాలా పెద్ద హీరోతో నటించబోతున్నావు.

' అని అన్నాడు.దాంతో చెప్పండి ఎవరాయన అని నేను ఆసక్తిగా అడిగాను.

ఇంకెవరో కాదు ఆయన ఎన్టీ రామారావు అని చెప్పేసారు.ఆ మాట వినగానే నేను నిజంగానే షాక్ అయ్యాను.

" అని చెప్పుకొచ్చింది.ఇంతకుముందు ఎన్టీఆర్ మనవరాలుగా నటించాను మళ్లీ ఆయన పక్కన హీరోయిన్ గా నేను నటించగలనా అని కూడా తాను రాఘవేంద్రరావుని అడిగినట్లు శ్రీదేవి తెలిపింది.

అయితే అంతకుముందే తాను ఎన్టీఆర్ తో మాట్లాడానని, నీతో నటించడానికి ఎన్టీఆర్ చాలా సంతోషించాడని రాఘవేంద్రరావు శ్రీదేవికి చెప్పాడు.

పరిస్థితి చేయిదాటుతోంది .. జగన్ అలా చేయాల్సిందేనా ?