శ్రీదేవి డ్రామా కంపెనీలో లేడీ కండక్టర్ జీవిత కథ.. ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించిందిగా!

తెలుగు బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

వారం వారం ఎంటర్టైన్మెంట్ ను పెంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వెళ్తున్నారు.కాగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయింది.

ఆ ప్రోమోలో పల్సర్ బైక్ పాటతో ఎంట్రీ ఇచ్చింది గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ.

ఆమె స్టేజి మీదకి ఎక్కగానే APSRTC లో పనిచేస్తాను అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి అందరికీ తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం.

నాకు ఫస్ట్‌ లో ఇంట్లో నుంచి సపోర్ట్ లేదు.కానీ నాకు అదే డాన్స్ ఈ రోజు నాకు అన్నం పెడుతుంది.

నేను ఈరోజు స్టేజ్ డాన్సర్ నుంచి పెద్ద పెద్ద వేదికల పై డాన్స్ చేస్తున్నానంటే కారణం మా గురువు గారు రమేష్ గారు అని తెలిపింది ఝాన్సీ.

అలాగే నేను గాజువాక డిపో కండక్టర్‌గా గత 11 ఏళ్లుగా పనిచేస్తున్నాను.ఇక అప్పటి నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను.

అయితే అప్పట్లో సోషల్ మీడియా లేదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సోషల్ మీడియా ద్వారా నాకు ఇంత పేరు వచ్చింది అని తెలిపింది ఝాన్సీ.

నాలో ఉన్న ఎనర్జీని మరింత పెంచింది.శ్రీదేవీ డ్రామా కంపెనీలో డాన్స్ చేయడం ద్వారా మరింత పేరు వచ్చింది అని చెప్పుకొచ్చింది ఝాన్సీ.

"""/"/ నాకు పెళ్లి అయింది.మా ఆయన కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు.

ఒకవైపు ఉద్యోగం మరొకవైపు డాన్స్ చేస్తున్నాను అంటే కారణం మా డిపో వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహమే అని ఆమె తెలిపింది.

నాకు ఎక్కడైనా పోగ్రామ్ ఉంది అంటే చాలు షిఫ్ట్ లు మార్చేవారు.టీవీ ఛానల్ కి వెళ్తున్నాను అంటే 3 నెలల పాటు లీవ్ ఇచ్చేవారు.

అలా మా డిపో వారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు అని చెప్పుకొచ్చింది ఝాన్సీ.

నేను డాన్స్‌ విషయంలో ఎంత జోష్‌గా ఉంటానో డ్యూటీ విషయంలో కూడా అదే జోష్ చూపిస్తాను.

అందువల్లే నా బస్ ఎక్కడానికి చాలా ఇంట్రస్ట్ చూపిస్తారు.నేను టికెట్ అడిగే విధానం కానీ.

పాస్ చూసే విధానం కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. """/"/ స్ట్రిక్ట్‌గా ఉంటాను సరదాగానూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.

అలాగే జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టాలను కూడా అనుభవించాను అని ఆమె తెలిపింది.

మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్.ఒక ప్రభుత్వ ఉద్యోగి అవి కూడా మమ్మల్ని రోడ్డున వదిలేసి వెళ్లిపోయారు.

కానీ మా అమ్మ మమ్మల్ని వదిలేయకుండా పెంచి పెద్ద చేసింది.నేను ఇంటర్ ఫస్టియర్ లో ఉన్నప్పుడే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను.

తాను కూడా ఒక డాన్సరే.నేను చేసిన ప్రతి టీవీ ప్రోగ్రాంలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ దగ్గర నా హస్బెండ్ చేశారు అని చెప్పుకొచ్చింది ఝాన్సీ.

వింట‌ర్ లో మిమ్మ‌ల్ని ఆరోగ్యంగా ఉంచ‌డానికి తోడ్ప‌డే పండ్లు ఇవే..!