ఘనంగా శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం కన్నుల పండుగగా జరిగాయి.

సోమవారం ఉదయం గరుడసేవ స్థాపిత పూజ మూల మంత్ర హావనం నవగ్రహా హావనం భలిహారణం పూర్ణహుతి సాయంత్రం రథోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బుగ్గ వాసు శర్మ ఆధ్వర్యంలో బుగ్గ కృష్ణమూర్తి శర్మ , బుగ్గ శ్రీనివాస్ శర్మ, బి నరహారి శర్మ,బి ఆంజనేయ శర్మ , బి శ్రీనివాస్ శర్మ లు కన్నుల పండువగా నిర్వహించారు.

స్వామి వారి కళ్యాణోత్సవం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ గౌస్ బాయి, పందిర్ల లింగం గౌడ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి , వంగ గిరిధర్ రెడ్డి, గూడ విజయ్ రెడ్డి ,మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య , గుండాడి రాంరెడ్డి , గుర్రపు రాములు , బండారి బాల్ రెడ్డి ,గంట బుచ్చాగౌడు , వడ్నాల ఆంజనేయులు , గోగూరి శ్రీనివాస్ రెడ్డి, నారాగౌడ్ , గ్రామ శాఖ అధ్యక్షులు ముద్ర కోల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పాశం సరోజన దేవా రెడ్డి , ఉప సర్పంచ్ దేవయ్య , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కొండ రమేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, జభ్భర్ ,బిఆర్ ఎస్ పార్టీ యూత్ లీడర్ రాజిరెడ్డి బిజెపి నాయకులు గణేష్ , లు వివిధ పార్టీల నాయకులు గొల్లపల్లి గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు.

గ్రామ పురవీధుల్లో సాయంత్రం రథోత్సవాన్ని గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిర్ల సుధాకర్ సుజాత దంపతులు ఈ కళ్యాణోత్సవం లో పాల్గొన్న భక్త కోటికి అన్నప్రసాదం వితరణ చేశారు.

అనంతరం ఆలయంలో శివరాం కృష్ణ భక్త మండలి చే భక్తి పాటలు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.

దేవర మూవీ గురించి అదిరిపోయే అప్ డేట్.. అప్పటినుంచే షోలు మొదలవుతాయా?