రాజన్న ఆలయంలో శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ త్యాగరాజ ఆరోధానోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి .

దక్షీణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి అరాధనోత్సవాలను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఉదయం స్వస్తి పుణ్యహవాచనము నిర్వహించి పట్టణంలో నగర సంకీర్తన చేశారు.ఐదు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలను జరిపించెందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వాగ్దేయకారుడు త్యాగరాజు రచించిన శ్రీ రామ కీర్తనలు ఎంతో గుర్తింపు నిచ్చాయి.

కర్ణాటక సంగీతంలో ఎంతో పేరు ప్రతిష్టతలు సంపాదించిన శ్రీ త్యాగరాజస్వామి వారి జన్మదినం రోజుని సంగీత దినంగా, అరాధనోత్సవాలను రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత 71 ఏళ్లుగా శ్రీ త్యాగరాజ స్వామివారి అరాధనోత్సములను ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ త్యాగరాజ ఉత్సవమూలలో తెలంగాణ రాష్ర్టంతో పాటు వివిధ ప్రాంతాలకి చెందిన సుప్రసిద్ద కళాకారులచే శాస్ర్తీయ, భక్తీ, సంగీత, జంత్రవాద్య, సోలో, హరికథ, నృత్యా, హరికథ, నాటక, ఉపన్యాస, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే బలహీనత నుంచి నిద్రలేమి వరకు అనేక సమస్యలు పరార్!