ఇది ఎక్సపోసింగ్ కాదా..? అంటూ శ్రీరెడ్డి మరో సంచలన పోస్ట్.! కానీ తర్వాత ఏం పోస్ట్ చేసింది అంటే.?
TeluguStop.com
తెలుగు సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి కొన్ని రోజుల కిందట ఉద్యమం లేవనెత్తిన సంగతి తెలిసిందే.
ఆమె చేసిన నిరసన, సినీ పరిశ్రమలోని కీలక వ్యక్తులపై ఆమె చేసిన ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించాయి.
కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా మరో బాంబ్ పేల్చింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన రాజకీయ ప్రసంగాల్లో మహిళా విభాగం గురించి చేసిన కామెంట్లను ఉద్దేశించి శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
ఆయన నటించిన సినిమాల్లోని ఫోటోలు పోస్టు చేస్తూ….పవన్ కళ్యాణ్ గురించి తన మనసులో ఉన్న మాటలను బయట పెట్టింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;"img Src=" "/
ఓ వైపు ఇండస్ట్రీలో సమస్యలు, ఇక్కడి మనుషుల వ్యక్తిత్వాలు, వారి అసలు స్వరూపాల గురించి బయట పెడుతూ సంచలన ఆరోపణలు చేస్తూనే….
అభిమానులకు బోర్ కొట్టకుండా తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది శ్రీరెడ్డి.అంతేకాదు తన ఫేస్బుక్ పేజీ ద్వారా తమిళ అగ్రదర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది.
తెలుగులోనూ సినిమాలు చేసిన తమిళ అగ్రదర్శకుడు తనకు సినిమా ఆఫర్ ఇస్తానని మోసం చేసినట్టు ఆ పోస్ట్‌లో పేర్కొంది.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ రచయిత ద్వారా తాను ఆ తమిళ అగ్రదర్శకుడిని కలిశానని, ఆయన ఉంటున్న స్టార్ హోటల్‌కు వెళ్లానని, ఆ సందర్భంగా ఆయన తనకు సినిమా ఆఫర్ ఇస్తానని మాటిచ్చారని శ్రీరెడ్డి వెల్లడించింది.
అయితే ఆ దర్శకుడు ఇప్పటివరకు తనకు ఆఫర్ ఇవ్వలేదని చెప్పింది.మరి, శ్రీరెడ్డి ఆరోపణలపై ఆ దర్శకుడు స్పందిస్తాడో లేదో చూడాలి.
Lorem Ipsum Dolor Sit Amet