Sri Reddy : తొక్కలో కెప్టెన్సీ అంటూ రోహిత్ శర్మపై శ్రీరెడ్డి ఫైర్.. కోహ్లీ నవ్వుకుంటున్నాడంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీరెడ్డి ( Sri Reddy )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

తరచూ వివాదాలతో వివాదాస్పద నటిగా కూడా పేరు తెచ్చుకుని శ్రీ రెడ్డి.అంతేకాకుండా నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలను గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇక ఎప్పుడైనా అవతలి వారు ఆమె గురించి ఏదైనా మాట్లాడారు అంటే చాలు, అవతలి వారి పని పట్టే వరకు ఆమె విడిచిపెట్టదు.

""<img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2023/06/sri-reddy-india-vs-australia-tollywood-rohith-sharma-tweet-viral-sports!--jpg మొన్నటి వరకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి వంటలు చేసుకుంటూ ఉన్న శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో మళ్లీ వరుసగా వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను( Rohith Sharma ) టార్గె్ట్ చేస్తూ విమర్శలు చేసింది.

తనదైన శైలిలో ట్వీట్ చేసింది రోహిత్ శర్మ కెప్టెన్సీపై శ్రీరెడ్డి విమర్శలు చేయడం ఆశ్చర్యకరం.

విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తూ రోహిత్‌ను తక్కువ చేసి మాట్లాడింది.దీంతో రోహిత్ అభిమానులు శ్రీ రెడ్డి పై మండిపడుతున్నారు.

"""/" / తొక్కలో కెప్టెన్సీ.ఇదేమన్నా ఐపీఎల్ ( IPL )అనుకున్నవావా బాబు.

నీ కెప్టెన్సీ చూసి కోహ్లి నవ్వుకుంటున్నాడు.ఇదేంట్రా బాబూ అని.

రోజలంతా ఫీల్డింగ్ చేస్తూ బౌలింగ్ చెయ్యాలంటే ప్లేయర్స్‌ లో జోష్ కావాలి.అది కోహ్లి ఒక్కడే చెయ్యగలడు.

ప్లేయర్స్‌ను అతడు ఇన్‌స్పైర్ చేస్తాడు.ప్రపంచంలోనే అతడు ఉత్తమ టెస్ట్ కెప్టెన్ అని శ్రీరెడ్డి తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.

అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రోహిత్ శర్మ అభిమానులు శ్రీరెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెని బూతులు తిడుతున్నారు.