మా ఎన్నికలు... శ్రీరెడ్డి వ్యాఖ్యలతో సీన్‌ రివర్స్‌ అయ్యేలా ఉందే

రేపు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే.ఈ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్‌ మరియు నరేష్‌ ప్యానల్‌లు పోటీ చేస్తున్నాయి.

శివాజీ రాజా ప్యానల్‌ ఇప్పటికే అధ్యక్షుడిగా బాధ్యతలు వహించి ఉంది.శివాజీ రాజా పోయిన సారి ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు.

ఈసారి ఆ పదవిని నరేష్‌ కోరుకుంటుండగా, శివాజీ రాజా మాత్రం తానే అధ్యక్షుడిగా ఉంటాను అంటూ పట్టుబడుతున్నాడు.

శివాజీ రాజాపై నరేష్‌ కొన్ని కీలక విమర్శలు చేసిన నేపథ్యంలో మాలో నరేష్‌ బలం పెరిగిందని అంతా భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి సీన్‌ ను రివర్స్‌ చేసేసింది.

కొన్నాళ్ల క్రితం మాలో సభ్యత్వం కోసం శ్రీరెడ్డి సీరియస్‌గా ప్రయత్నించింది.ఆమెకు సభ్యత్వం ఇచ్చేందుకు శివాజీ రాజా ఒప్పుకోలేదు.

అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజాపై అప్పుడు శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.అయితే ఇప్పుడు ఆయనపై పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంది.

శివాజీ రాజాపై తనకు కోపం ఉన్న మాట వాస్తవమే, అలా అని మా ను వేరే వారి చేతుల్లోకి, అనర్హులు అయిన వారి చేతిలో పెట్టడంను తాను వ్యతిరేకిస్తున్నాను.

నరేష్‌ వల్ల మా కు ఏమాత్రం ఉపయోగం ఉంటుందని తాను భావించడం లేదు.

వందల కోట్ల ఆస్తులు ఉన్న నరేష్‌ ఇప్పటి వరకు మా కోసం వెలగబెట్టింది ఏంటో అందరికి తెల్సిందే.

అధ్యక్షుడిగా అయితే ఆయన చేసేది ఏంటో ఎవరు చెప్పలేరు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పైగా నరేష్‌ ప్యానల్‌లో అనర్హులు ఉన్నారు.

ఆ ప్యానల్‌లో ఉన్న ఆమె తన భర్త వద్దకు అమ్మాయిలను పంపుతుంది, అలాంటి వారికి మా ను అప్పగిస్తే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే శివాజీ రాజానే మరోసారి అధ్యక్షుడు అవ్వాలి, నరేష్‌ ప్యానల్‌ ఓడిపోవాలంటూ శ్రీరెడ్డి పిలుపునిచ్చింది.

నరేష్‌ ప్యానల్‌పై శ్రీరెడ్డి చేసిన విమర్శలు ఒక్కసారిగా సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

దాంతో ఆ హీరో, హీరోయిన్‌ చేతిలోకి మా వెళ్లవద్దనే నిర్ణయానికి కొందరు వచ్చినట్లుగా తెలుస్తోంది.

శ్రీరెడ్డి వ్యాఖ్యలు కనుక బలంగా పని చేస్తే ఖచ్చితంగా మా ఎన్నికల్లో శివాజీ రాజా ఘన విజయం సాధిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

మరో 24 గంటల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆ యూకే యూనివర్సిటీలో పోలీస్‌లు సర్‌ప్రైజ్ రైడ్.. కారణం తెలిస్తే..??