పుచ్చకాయపై శ్రీరాముడు.. అద్భుతమైన ఆర్ట్‌తో ఆశ్చర్యపరిచిన చెఫ్..
TeluguStop.com
సాధారణంగా వంటగాళ్లలో చాలా క్రియేటివిటీ ఉంటుంది.వారు తమ క్రియేటివిటీతో రకరకాలుగా వంటకాలు కనుగొని వాటిని అత్యంత టేస్టీగా తయారు చేస్తుంటారు.
చెఫ్‌లు తమ క్రియేటివిటీని ఉపయోగించి ఆ వంటకాలపై అందమైన ఫుడ్ డిజైన్స్ కూడా వేస్తుంటారు.
రకరకాల వెజిటబుల్స్‌తో వారు చేసే డెకరేషన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి.అయితే తాజాగా ఒక చెఫ్ తన సృజనాత్మకతతో పుచ్చకాయపై శ్రీరాముడి బొమ్మను అద్భుతంగా చెక్కాడు.
చూసేందుకు అది పుచ్చకాయ( Watermelon )లా కాకుండా ఒక అద్భుతమైన శ్రీరాముడి కళాఖండంలా కనిపించింది.
"""/" /
ఈ ఆర్ట్ క్రియేట్ చేసిన చెఫ్ పేరు అంకిత్ బగియాల్.
ఇతను తన పుచ్చకాయ ఆర్ట్‌కి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ( Ankitbagiyal ) అకౌంట్లో షేర్ చేశాడు.
దీనిని అప్లోడ్ చేసిన కొంతసేపటికే వైరల్ అయింది.దీనికి లక్షల కొద్ది వ్యూస్, వేలలో లైకులు వచ్చాయి.
వీడియో చూసిన నెటిజన్లు ఈ ఆర్ట్ వర్క్ కి ఫిదా అయిపోయారు.'జై శ్రీరామ్' అంటూ కామెంట్ సెక్షన్లో శ్రీరామనామ ( Shri Rama )స్మరణతో హోరెత్తించారు.
అంకిత్ ఇన్క్రెడిబుల్ ఆర్ట్‌వర్క్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. """/" /
వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక పుచ్చకాయ కనిపిస్తుంది.
దానిపై ఒక భాగంలో శ్రీరాముని చిత్రం అత్యంత అందంగా చెక్కి ఉండటం గమనించవచ్చు.
శ్రీరాముని బొమ్మ పక్కనే జై శ్రీరామ్ అని ఇంగ్లీషులో Https://telugustop!--com/రాసి ఉండడం కూడా మీరు చదవచ్చు.
ఈ ఆర్ట్ సృష్టించడానికి అతను ఒక పుచ్చకాయ పొట్టు తొలగించాడు.కానీ ఈ సంగతి బాగా పరిశీలిస్తే తప్ప తెలియడం లేదు.
మొత్తం మీద సాధారణ పుచ్చకాయపై ఇలాంటి అద్భుతమైన ఆర్ట్ చెక్కడం చాలా గొప్ప విషయం అని నెటిజన్లు అతన్ని పొగిడేస్తున్నారు.
పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన సాయితేజ్.. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారంటూ?