చూపు లేకపోయినా 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతి.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
చూపు లేని వాళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.ఒక యువతి చూపు లేకపోయినా 6 ప్రభుత్వ ఉద్యోగాలు( 6 Govt Jobs ) సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఈమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పట్టుదల, కృషి, కసితో కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన శ్రీ పూజిత ( Sri Poojita )సక్సెస్ స్టోరి నెట్టింట వైరల్ అవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండకు చెందిన శ్రీపూజిత పదో తరగతి వరకు నల్గొండ అంధుల పాఠశాలలో చదివారు.
హైదరాబాద్ లోని సాయి అంధుల కాలేజ్ లో ఆమె ఇంటర్ పూర్తి చేశారు.
ఆ తర్వాత డిగ్రీ బీఏ, పీజీ హిస్టరీ, బీఈడీ చదివిన శ్రీ పూజిత జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్షకు సైతం అర్హత సాధించడం గమనార్హం.
"""/" /
2022లో తొలి ప్రయత్నంలో ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ లో చేరిన పూజిత ఈ ఏడాది విడుదలైన గురుకుల ఫలితాలలో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది.
పీజీటీ తెలుగు, సోషల్, టీజీటీ తెలుగు, సాంఘిక శాస్త్రం, జూనియర్ లెక్చరర్ తెలుగు, డిగ్రీ లెక్చరర్ తెలుగు ఉద్యోగాలను ఆమె సాధించారు.
తాను అంధురాలినని ఏరోజు కూడా బాధ పడలేదని శ్రీ పూజిత వెల్లడించారు. """/" /
మా తల్లీదండ్రులు నిత్యం ఎంతో ఆత్మస్థైర్యం ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
తాను బ్రెయిలీ లిపిలో చదివానని శ్రీ పూజిత పేర్కొన్నారు.పేరెంట్స్ సహాయసహకారాలతో తాను ఈ స్థాయికి ఎదిగారని ఆమె వెల్లడించారు.
డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని తాను ఎంచుకుంటానని శ్రీ పూజిత తెలిపారు.శ్రీ పూజిత టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
థమన్ ఆవేదన గురించి రియాక్ట్ అయిన చిరంజీవి.. అలా కామెంట్లు చేశారా?