క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారీ పరుగుల తేడాతో శ్రీలంక విజయం..!

వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించడం కోసం పలు జట్లు క్వాలిఫయర్ మ్యాచ్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

తాజాగా శ్రీలంక-యూఏఈ ( Sri Lanka-UAE )మధ్య జరిగిన మ్యాచ్లో శ్రీలంక భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

పసికూన యూఏఈ ను చిత్తు చేసింది. """/" / టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.

శ్రీలంక తన మొదటి వికెట్ కోల్పోయే సమయానికి ఫతుమ్ నిశాంక, కరుణ రత్నే లు 95 పరుగులు జోడించారు.

టాపార్డర్ లోనే నలుగురు ప్లేయర్లు అర్థ సెంచరీలు చేయడంతో శ్రీలంక భారీ స్కోరు నమోదు చేసింది.

ఫతుమ్ నిశాంక( Fatum Nishanka ) 57 పరుగులు, కరుణ రత్నే( Karuna Ratne ) 52 పరుగులు, కుశాల్ మెండిస్ 78 పరుగులు, అసలంక 48 పరుగులు చేశారు.

"""/" / భారీ పరుగుల లక్ష్య చేదన కు దిగిన యూఏఈ జట్టు ఆరంభం నుంచే తడబడింది.

శ్రీలంక బౌలర్ల ధాటికి యూఏఈ బ్యాటర్లు తట్టుకోలేక పోయారు.యూఏఈ కెప్టెన్ మహమ్మద్ V వసీం 39 పరుగులు, వృత్య అరవింద్ 39 పరుగులు చేశారు.

మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు.యూఏఈ 39 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

ఇక శ్రీలంక బౌలర్ హాసరంగ 8 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు వికెట్లు తీసి కేవలం 24 పరుగులు సమర్పించుకున్నాడు.

మిగిలిన శ్రీలంక బౌలర్లు చెరో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో యూఏఈ 175 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది.

ఇక వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లలో తన తొలి మ్యాచ్ లోనే భారీ పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శ్రీలంక శుభారంభం ప్రారంభించింది.