బంగ్లాదేశ్ పై ఓటమి వరల్డ్ కప్ టోర్నీ నుంచి శ్రీలంక అవుట్..!!

వరల్డ్ కప్ టోర్నీలో నేడు బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో.బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక 49.

3 ఓవర్లలో 279 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.శ్రీలంక జట్టులో చరిత్ అసలంక 108 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడటం జరిగింది.

నీస్సాలంక 41, సమర విక్రమ 41, ధనుంజయ డీసిల్వా 34.పరుగులు చేశారు.

బంగ్లాదేశ్ బౌలర్ లలో తంజీమ్ హసన్ 3, షోరిఫుల్ 2, షకీబ్ 2, మోహిదీ హసన్ 1 వికెట్ తీయడం జరిగింది.

"""/" /   అనంతరం 280 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 41.

1 ఓవర్ లలో ఏడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది.బంగ్లాదేశ్ జట్టులో శాంటో 90, షకీబ్ 82.

హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి బంగ్లాదేశ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

ఈ వరల్డ్ కప్ టోర్నీలో.8 మ్యాచ్ లు ఆడిన బంగ్లాదేశ్.

రెండు మ్యాచ్ లు గెలవడం జరిగింది.నవంబర్ 11వ తారీకు ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇదిలా ఉంటే ఈ ఓటమితో శ్రీలంక వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించడం జరిగింది.

పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఫోకస్ చేసిన అకీరా… ఆత్రుతగా ఉందంటూ?