శిరస్సు లేకుండా అమ్మవారు..బిందెడు పసుపు నీళ్లను సమర్పిస్తే..!

మనదేశంలో ఏ దేవాలయానికి వెళ్ళినా కళ్లారా అమ్మవారు లేదా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.

కానీ విశాఖలో ఉన్న ఎరుకుమాంబ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు.ఆ ప్లేస్ లో ఓంకారం కనిపిస్తుంది.

మరి తల అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది.కేవలం ఒక బిందెండు పసుపు నీళ్లు సమర్పించుకుంటే చాలు కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

ఆది పరాశక్తిగా పిలుచుకునే అమ్మవారికి చాలా రూపాలు ఉన్నాయి.ఒక్కో గ్రామంలో అమ్మవారు ఒక్క రూపంలో కొలువై ఉంటుంది.

కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ప్రతిష్టించగా, మరికొన్ని ప్రాంతాల్లో స్వయంభుగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారు ఉన్నారు.

అలాంటి అమ్మవారు కొలువైన దేవాలయం దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకుమాంబ( Sri Erukumamba Temple ).

కేవలం విశాఖ వాసులకే కాకుండా ఉత్తరాంధ్రవాసులకు కూడా సెంటిమెంట్ అని స్థానికులు చెబుతూ ఉంటారు.

"""/" / ఇక్కడ కొలువైన అమ్మవారి వెనుక భాగంలో శ్రీ చక్రం ఉందని పూజారులు చెబుతున్నారు.

గౌరీ స్వరూపంగా భావించే అమ్మవారి గురించి ఉన్న ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మ వారు పూజలు అందుకునేవారు.

రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరు వెళ్లిపోయారు.అప్పుడు అమ్మవారు స్థానికుల కలలో కనిపించి తనని అక్కడి నుంచి తీసుకెళ్లి దేవాలయం నిర్మించాలని చెప్పారు.

"""/" / అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద నుంచి తీసుకెళుతున్న ఒక ప్రదేశంలో బండి ఆగినప్పుడు అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిందట.

ఆ శిరస్సును అతికించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.ఏమైనా అరిష్టమో అనుకొని భక్తులు వేడుకోవడంతో తన కాళ్ళ దగ్గర శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని అమ్మవారు చెప్పారు.

అప్పటినుంచి బిందె నీళ్లను సమర్పిస్తుంటే అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు( Devotees ) చెబుతున్నారు.

బుధవారం రోజు అమ్మవారికి పసుపు నీళ్ళు సమర్పిస్తే వివాహం జరగడం ఆలస్యం అయినా వారికి స్థానికులు నమ్ముతారు.

వైరల్ వీడియో: ఏంది భయ్యా.. అది కొండచిలువ అనుకున్నావా లేక.?