నేను అలా చేస్తే వాళ్ళు ఒప్పుకోరు.. నెటిజెన్ ప్రశ్నకు శ్రీముఖి రియాక్షన్?

యాంకర్ శ్రీముఖి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగు బుల్లితెర పై యాంకర్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.

యాంకర్ గా తన మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ కట్టిపడేసింది.తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్ లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.

బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో శ్రీముఖి హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

శ్రీముఖికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీముఖి ఫుల్ బిజీగా మారిపోయింది.

ఈ క్రమంలోనే బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ లాంటి వాటికీ హోస్ట్ గా వ్యవహరిస్తూనే మధ్యలో తప్పుకుంది.

ఇక త్వరలో జాతిరత్నాలు అంటూ రాబోతున్న కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరించబోతోంది.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది.

"""/"/ ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.

చాలా గ్యాప్ తరువాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ ను పెట్టేసింది.ఈ క్రమంలోనే శ్రీముఖి అభిమానులు ఒక్కొక్కరు ఒక ప్రశ్న వేశారు.

కానీ అందులో ఒక నెటిజెన్ మాత్రం తన పొడవాటి జుట్టు గురించి అడిగేశాడు.

మీరు షార్ట్ హెయిర్ ట్రై చేశారా? గత కొంత కాలంగా అదే హెయిర్ స్టైల్ చూసి బోర్ కొడుతుంది అని ఒక నెటిజన్ అడిగాడు.

దానికి శ్రీముఖి ఈ విధంగా సమాధానం ఇచ్చింది.అవును మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తాను.

కానీ నేను చేస్తున్న షోలు, సినిమాల ప్రకారం షార్ట్ హెయిర్ ఉంటే ఒప్పుకోరు అని తెలిపింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్7, సోమవారం 2024