పెళ్లైన హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీలీల.. కలల రాకుమారుడు అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీలకు( Sreeleela ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న స్థాయిలో మరే హీరోయిన్ చేతిలో సినిమాలు లేవనే సంగతి తెలిసిందే.
శ్రీలీల నటించిన స్కంద మూవీ( Skanda Movie ) బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
తాజాగా హీరోయిన్ శ్రీలీల సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి.
మ్యాడ్ మూవీ ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడుతూ ఈ సినిమా ఈవెంట్ కు దుల్కర్ సల్మాన్( Dulquer Salman ) వస్తున్నారని తెలిసి మా అమ్మ చాలా సంతోషించిందని మిమ్మల్ని అడిగానని కూడా చెప్పమందని శ్రీలీల అన్నారు.
నాకు బాల్యంలో ఒక కల వచ్చేదని మా అమ్మమ్మ చెప్పిన కథలు విని గుర్రంపై వచ్చే యువరాజును ఊహించుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
దుల్కర్ సల్మాన్ హీరేయ్ సాంగ్ చూసిన సమయంలో నా రాకుమారుడు మీరేనని అనిపిస్తుందని ఆమె తెలిపారు.
"""/" /
దుల్కర్ సల్మాన్ పెళ్లైన హీరో కాగా ఎంతోమంది అభిమానుల క్రష్ అయిన శ్రీలీల దుల్కర్ గురించి ఈ విధంగా కామెంట్లు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాతో మరోమారు శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అక్టోబర్ నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. """/" /
హన్మకొండలో భగవంత్ కేసరి మూవీ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుండగా ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
అటు బాలయ్య( Balakrishna ) మార్క్, ఇటు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) మార్క్ తో ఈ సినిమా ఉండనుందని భగవంత్ కేసరి బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?