రష్మిక స్థానాన్ని భర్తీ చేస్తున్న శ్రీ లీల… నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ?

శ్రీ లీల ( Sree Leela )ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో మొదటి జాబితాలో ఉంది యంగ్ హీరోల నుంచి మొదలుకొని స్టార్ సీనియర్ హీరోలు అందరి వరకు కూడా ఈమె ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు.

ఇలా కెరియర్ పరంగా శ్రీ లీల ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటివరకు సుమారు డజను సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకున్నటువంటి ఈమె మరో కొత్త సినిమాకు కూడా కమిట్ అయ్యారు.

శ్రీ లీల ఇండస్ట్రీలోకి రావడంతో చాలామంది హీరోయిన్స్ అవకాశాలను కోల్పోతున్నారని చెప్పాలి. """/" / ఈ క్రమంలోనే తాజాగా వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వంలో నితిన్( Nithin ) కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఘనంగా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి రష్మిక ( Rashmika ) హీరోయిన్ గా తప్పుకున్నారు.

ఇలా రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణాలు మాత్రం తెలియకపోయినా ఈ సినిమాలో రష్మిక స్థానాన్ని శ్రీలీల ఆక్రమించిందని తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు శ్రీ లీల ఎంపికైనట్టు తెలుస్తుంది. """/" / ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

అదే విధంగా వెంకి కుడుముల సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.వక్కంతం డైరెక్షన్లో నటిస్తున్నటువంటి సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నితిన్ వెంకి కుడుములు డైరెక్షన్లో బిజీ కానున్నారు.

ఇక ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల సందడి చేయబోతున్నారు.ఇక శ్రీల సినిమాల విషయానికి వస్తే ఆ లిస్టు పెద్దదే ఉందని చెప్పాలి.

వచ్చే నెల నుంచి ఈమె నటించిన సినిమాలన్నీ వరుసన విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ప్రీ వెడ్డింగ్ షూట్‌లో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్