పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయడానికి అదే కారణం.. ఆయనే డాన్సింగ్ కింగ్: శ్రీ లీల
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల( Sreeleela ) ఇటీవల అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే .
ఈ సాంగ్ ఓ రేంజ్ లో సినిమా పై అంచనాలను పెంచేసింది.ఇక అల్లు అర్జున్ కు పోటీగా శ్రీ లీలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి.
ఇక శ్రీ లీలతో డాన్స్ అంటే అల్లు అర్జున్ తన కెరీర్ లో ఫస్ట్ టైం డాన్స్ ప్రాక్టీస్ చేశాను అంటూ ఇటీవల శ్రీ లీల డాన్స్ పై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
"""/" /
ఇకపోతే తాజగా శ్రీ లీల రాబిన్ హుడ్( Robin Hood ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అసలు తాను ఎందుకు ఈ స్పెషల్ సాంగ్ చేశాననే విషయం గురించి కూడా తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ ఈమెను ప్రశ్నిస్తూ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా స్పెషల్ సాంగ్ చేయడానికి కారణమేంటని ప్రశ్నించగా దానికి చాలా పెద్ద కారణమే ఉంది అది ఏంటి అనేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుందని సమాధానం చెప్పారు.
"""/" /
ఇక అల్లు అర్జున్ మిమ్మల్ని డ్యాన్సింగ్ క్వీన్ అంటూ పిలిచారు మరి మీ దృష్టిలో డ్యాన్సింగ్ కింగ్ ఎవరు అంటూ రిపోర్టర్స్ ప్రశ్నించారు.
నా దృష్టిలో డ్యాన్సింగ్ కింగ్ అల్లు అర్జున్ గారే.మా కాంబినేషన్లో వచ్చిన ఈ పాట అందుకే మంచిగా హిట్ అయింది అంటూ శ్రీ లీల చెప్పుకువచ్చారు.
ఇక ఈ పాట కోసం మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో ఇప్పటివరకు రెమ్యూనరేషన్ గురించి నేను నిర్మాతలతో ఎక్కడ మాట్లాడలేదు.
ఈ పాటను నేను కేవలం ఒక బాధ్యతగా మాత్రమే చేశాను అంటూ శ్రీ లీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ