Sreeleela : అయ్యో పాపం.. శ్రీలీలకు కూడా అలాంటి కష్టాలే.. ఆ డైరెక్టర్ చెత్త కోరికలతో?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీ లీల( Sreeleela ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు( Raghavendra Rao ) దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమా( Pelli Sandadi Movie )తో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడు, రోషన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

అయితే మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను అందుకున్న శ్రీ లీల తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ లలో అతి తక్కువ సమయంలో భారీగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో శ్రీ లీల కూడా ఒకరు.

"""/" / ఇకపోతే ఇటీవల శ్రీలీల ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో మరొక హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది.ఇకపోతే హీరోయిన్ శ్రీ లీలకు యూత్ లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఇక అసలు విషయంలోకి వెళితే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు బలైన విషయం తెలిసిందే.

చాలామంది నటీనటులు సినిమా ఇండస్ట్రీలో వారికి ఎదురైన క్యాస్టింగ్ కావచ్చు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం హీరోయిన్ శ్రీలీల కూడా క్యాచింగ్ కౌచ్ బాధితురాలే అని తెలుస్తోంది.

"""/" / సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈమె కాస్టింగ్ అనుభవాలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.

శ్రీలీల కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.ఆమె కెరియర్ స్టార్టింగ్ లో ఆమెను ఒక కన్నడ డైరెక్టర్ కలిసారట.

తన కోరిక తీరిస్తే పెద్ద ఆఫర్ ఇస్తానని డీలు మాట్లాడాడట.మొదటి నుంచి పట్టుదల ఉన్న శ్రీలీల అందుకు ఒప్పుకోలేదట.

ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి తనకాళ్ళపై తాను నిలబడాలని ప్రయత్నించింది.ఇక అనుకున్న విధంగానే ప్రస్తుతం తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతోంది.

ప్రస్తుతం ఈమె మరికొన్ని సినిమాలను నటించనుందని ప్రస్తుతం అవి చర్చలు దశలో ఉన్నట్లు తెలుస్తోంది.