పుష్ప సీక్వెల్ లో శ్రీలీల లుక్ లీక్.. డ్యాన్స్ తో మరోసారి అదరగొట్టడం పక్కా!
TeluguStop.com
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ గురించి మనందరికీ తెలిసిందే.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
కాగా త్వరలోనే అనగా డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు నెలరోజులు కూడా సమయం లేదు.దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమాలో మిగిలిన కొంత మేర షూటింగ్ని పూర్తి చేసి ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు.
"""/" /
ఇకపోతే దర్శకుడు సుకుమార్ తన సినిమాలలో ఐటెం సాంగ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనందరికీ తెలిసిందే.
దాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సినిమాలోనూ ఒక అద్భుతమైన ఐటమ్ సాంగ్ ని క్రియేట్ చేస్తారు.
ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ని కూడా అదే విధంగా క్రియేట్ చేయబోతున్నారు.
పాటను ఎవరితో చెయ్యాలి అనే విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగిన తర్వాత టాలీవుడ్‌లో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రీలీలను( Sreeleela ) ఎంపిక చేశారట.
గత వారం రోజులుగా ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
"""/" /
శ్రీ లీలా కూడా మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే.
ఎలాంటి స్టెప్స్ అయినా సరే ఇరగదీయడం ఖాయం.శ్రీలీలకు ఈ ఐటమ్ సాంగ్( Item Song ) పర్‌ఫెక్ట్ యాప్ట్ అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
ఇకపోతే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ను ఇటీవల ప్రారంభించింది చిత్ర యూనిట్.
గత ఐదు రోజులుగా ఈ పాటను షూట్ చేస్తున్నారు.ఈ ఐటమ్ సాంగ్ పేరు కిస్సిక్.
పుష్ప2 లోని కిస్సిక్ సాంగ్ ఊ అంటావా మావా అనే పాటను మించిన స్థాయిలో ఉండాలని కృషి చేస్తున్నారట.
ఇదిలా ఉంటే ఈ పాటలోని ఒక స్టిల్ నెట్టింట సందడి చేస్తోంది.ఈ స్టిల్ లో అల్లు అర్జున్,( Allu Arjun ) శ్రీలీల లుక్ చూసిన వారు డెఫినెట్ గా ఈ సాంగ్ మరో సంచలనం సృష్టిస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
ఇద్దరు కలసి స్టెప్పు వేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కీళ్ల నొప్పుల నుంచి మలబద్ధకం నివారణ వరకు ఆముదంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?