మా ఇంటికి చిట్టితల్లి వచ్చింది… ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీ లీల! 

సినీనటి శ్రీ లీల (Sreeleela)ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇక ఈమె కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్న కెరియర్ పరంగా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇటీవల ఈమె హీరో నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా ఈమె బిజీగా ఉన్నారు.

ఇలా సినిమాల పరంగా బిజీగా ఉండే శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు .

అయితే ఇటీవల ఈమె ఒక చిన్నారితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇలాంటి చిన్నారితో కలిసి దిగిన ఫోటోలు క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అసలు ఈ చిన్నారి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇలా శ్రీ లీల ఈ చిన్నారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంటికి అదనంగా.

హృదయాలపై దండయాత్ర అని క్యాప్షన్ ఇచ్చారు. """/" / ఈ విధంగా చిన్నారిని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకొని తనని ముద్దాడుతూ ఉన్నటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీ లీల ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం కొంపదీసి శ్రీ లీల ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే శ్రీ లీల ఈ చిన్నారిని దత్తత(Adopt) తీసుకున్నారని తెలుస్తోంది.శ్రీ లీల ఇంత చిన్న వయసులోనే ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి చదువులు బాగోగులు చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిన్నారిని కూడా దత్తత తీసుకోవడంతో మా ఇంటికి మరో చిన్నారి వచ్చింది అంటూ ఈమె సంతోషంతో ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ శ్రీ లీల మంచి తనంపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.