వాళ్లతో పోల్చితే మనం నథింగ్‌ అంటున్న శ్రీలీల

ఈ దసరా కి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari ) సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.

వచ్చే వారం లో రాబోతున్న ఈ సినిమా దసరా సినిమా ను కొన్ని రోజుల ముందే తీసుకు రాబోతున్నట్లుగా బాలయ్య అభిమానులు చాలా విశ్వాసంతో ఉన్నారు.

ఇక ఈ సినిమా లో కీలక పాత్ర లో నటించిన శ్రీ లీల యొక్క మాటలు సినిమా పై మరింత ఆసక్తిని పెంచాయి.

సినిమా లో బాలయ్య పాత్ర మరియు తన పాత్ర యొక్క స్వభావం గురించి ఆమె మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తిన విషయం తెల్సిందే.

"""/" / ఈ నెలలో భగవంత్ కేసరి సినిమా తో రాబోతున్న శ్రీలీల రాబోయే ఆరు నెలల పాటు వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద దండయాత్ర చేసేందుకు సిద్ధం అయింది.

హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో ఇంత బిజీగా ఉన్నారు కదా ఎలా అనిపిస్తుందని జర్నలిస్ట్‌ అడిగిన సమయంలో చాలా సౌమ్యంగా సమాధానం చెప్పి ముచ్చటేసేలా చేసింది.

ఒకప్పుడు ఎన్టీఆర్‌( SR Ntr ) గారు, ఆ తర్వాత జనరేషన్ హీరోలు ఏడాదిలో పది నుంచి పదిహేను సినిమాలు విడుదల చేసే వారు.

వారు ఏడాదికి అన్ని సినిమాలు చేశారు అంటే ఎంతటి గొప్ప విషయం చెప్పండి.

"""/" / వారితో పోల్చితే నేను నథింగ్ అని నా అభిప్రాయం అంటూ శ్రీలీల పేర్కొంది.

వచ్చే నెలలో మెగా హీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీలీల సంక్రాంతికి మహేష్ బాబు తో నటిస్తున్న గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అంతే కాకుండా మరో మూడు నాలుగు సినిమాలు కూడా శ్రీలీల( Sreeleela ) కమిట్‌ అవ్వడం, వాటి షూటింగ్‌ లో పాల్గొనడం చేస్తోంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో షూటింగ్స్‌, సినిమాల యొక్క ప్రమోషన్స్ తో చాలా ఇబ్బందిగా ఉందని కూడా శ్రీలీల చెప్పుకొచ్చింది.

ఈ కొన్ని సినిమాలకే నేను ఇంతగా ఇబ్బంది పడితే అప్పట్లో వారు ఎలా అన్నేసి సినిమాలు చేసేవారో అన్నట్లుగా శ్రీలీల వ్యాఖ్యలు చేసింది.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ 2000 కోట్ల క్లబ్ లో చేరుతారా..?