శ్రీకారం 7 రోజుల కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి.బరిలో జాతిరత్నాలు వంటి క్రేజీ చిత్రం ఉన్నా కూడా ‘శ్రీకారం’ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

ఇక రిలీజ్ రోజున ఈ సినిమాను మంచి టాక్ లభించినా కూడా అది వీకెండ్ వరకే ఉపయోగపడింది.

వీక్ డేస్‌లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా చాలా బలహీనపడింది.దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు తక్కువగా నమోదయ్యయి.

జాతిరత్నాలు చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో జనం ఆ సినిమాను చూసేందుకే ఆసక్తిని చూపారు.

దీంతో శ్రీకారం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి.ఇక ఏడు రోజులు ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.

9.13 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.

ఈ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూసిన శర్వానంద్‌కు మరోసారి నిరాశే మిగిలింది.

బి.కిషోర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

కాగా ఏరియాలవారీగా శ్రీకారం 7 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 2.

73 కోట్లు సీడెడ్ - 1.57 కోట్లు వైజాగ్ - 1.

16 కోట్లు తూర్పు - 72 లక్షలు పశ్చిమ - 49 లక్షలు కృష్ణా - 49 లక్షలు గుంటూరు - 96 లక్షలు నెల్లూరు - 32 లక్షలు టోటల్ ఏపీ+తెలంగాణ - రూ.

8.44 కోట్లు షేర్ కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా - 27 లక్షలు ఓవర్సీస్ - 42 లక్షలు టోటల్ వరల్డ్‌వైడ్ - రూ.

9.13 కోట్లు.

ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోలు వీళ్లే !