శ్రీకారం 4 రోజుల కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే బాసు!

యంగ్ హీరో శర్వానంద్ గతకొంత కాలంగా సరైన హిట్ పడకపోవడంతో అల్లాడిపోతున్నాడు.దీంతో ఆయన నటించిన తాజా చిత్రం శ్రీకారం చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని శర్వా ప్లాన్ చేశాడు.

పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

ఇక శ్రీకారం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించింది.

ముఖ్యంగా శర్వా అయితే ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఫిక్స్ అయిపోయాడు.

కానీ ఈ సినిమాకు రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

అంతేగాక బరిలో మరో ఫుల్టూ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ జాతిరత్నాలు శ్రీకారం చిత్రానికి గట్టి పోటీ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎవరూ ఇష్టపడటం లేదు.

కేవలం ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వారు ఈ సినిమాను చూసేందుకు వెళ్తున్నారు.

దీంతో ఈ సినిమా మొదటి 4 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.

8.11 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను భారీ రేటుకు సొంతం చేసుకున్నారు.

దీంతో ఈ సినిమా బిజినెస్ ఏకంగా రూ.17కోట్లకు జరిగింది.

అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించాల్సి ఉంది.

మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా అంత కలెక్ట్ చేస్తుందా అంటే కష్టమే బాసూ అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక ఈ సినిమా 4 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 2.38 కోట్లు సీడెడ్ - 1.

34 కోట్లు వైజాగ్ - 1.06 తూర్పు - 66 లక్షలు పశ్చిమ - 47 లక్షలు కృష్ణా - 44 లక్షలు గుంటూరు - 92 లక్షలు నెల్లూరు - 30 లక్షలు టోటల్ ఏపీ+తెలంగాణ - రూ.

7.57 కోట్లు షేర్ కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా - 22 లక్షలు ఓవర్సీస్ - 32 లక్షలు టోటల్ వరల్డ్‌వైడ్ - రూ.

8.11కోట్లు.

20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశా.. సీఎం రేవంత్