ఎన్టీఆర్ కారణంగా హీరో శ్రీకాంత్ కు గాయాలు… ఏమైందంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు శ్రీకాంత్( Sreekanth )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు ఫ్యామిలీ మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోలకు అన్నయ్య బాబాయ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ప్రస్తుతం శ్రీకాంత్ వరుస సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక ఈయన నటించిన ఆట బొమ్మాలి( Aata Bommaali ) సినిమా నవంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

"""/" / ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా శ్రీకాంత్ నాగార్జున ( Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో సందడి చేశారు.

ఈ వీకెండ్ లో భాగంగా శ్రీకాంత్ వేదిక పైకి వచ్చి కంటెస్టెంట్లతో మాట్లాడి సందడి చేశారు.

అదేవిధంగా తన సినిమాల గురించి కూడా తెలియజేశారు.తాను ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర( Devara ) సినిమాలో నటిస్తున్నానని అదేవిధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్( Game Changer ) సినిమాలో కూడా నటిస్తున్నానని ఈయన తెలియజేశారు.

ఈ రెండు సినిమాలకు తన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలిపారు./br> """/" / ఇక ఈ వేదిక పైకి శ్రీకాంత్ కాలికి బ్యాండేజ్ కట్టుకొని రావడంతో నాగార్జున అసలు ఏం జరిగింది అంటూ శ్రీకాంత్ ను ప్రశ్నించగా ఈయన దేవర సినిమా షూటింగ్ సమయంలో భాగంగా తన కాలికి గాయమైందని తెలియజేశారు.

ఇసుకలో షూటింగ్ చేస్తున్న సమయంలో తన కాలు బెనకడం వల్ల మొత్తం వాపు వచ్చిందని డాక్టర్ కి చూపించడంతో రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అంటూ శ్రీకాంత్ తెలిపారు.

ఇలా తనకు కాలికి గాయమైన తాను కొన్ని నిలబడి చెప్పే డైలాగ్స్ ఉండడంతో అలాగే షూటింగ్ పూర్తి చేసామని శ్రీకాంత్ తెలిపారు.

మరి నీ కాలికి గాయం అవ్వడానికి ఎన్టీఆర్( Ntr ) కారణమా అంటూ సరదాగా నాగార్జున అడగడంతో ఎన్టీఆర్ కారణం కాదు ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పగా ఎంతో మంది అభిమానులు త్వరగా శ్రీకాంత్ కోలుకోవాలని భావిస్తున్నారు.

ప్రభాస్ సినిమాలు రూ.1000 కోట్లు సాధించడం సాధారణం.. అమితాబ్ కామెంట్స్ వైరల్!