Sreeja: సంథింగ్ ఈస్ కమింగ్ అంటున్న శ్రీజ … వైరల్ అవుతున్న పోస్ట్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ(Sreeja )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ కేవలం తన వ్యక్తిగత కారణాలవల్ల మాత్రమే పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
ఈ విధంగా శ్రీజ కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు.
దీంతో అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనగా మారింది.అయితే ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించిన తర్వాత శ్రీజ తన భర్తతో మనస్పర్ధలు కారణంగా తన భర్త నుంచి విడాకులు(Divorce ) తీసుకొని విడిపోయారు.
"""/" /
ఇలా తన కూతురితో పాటు శ్రీజ చిరంజీవి (Chiranjeevi)ఇంటిని ఆశ్రయించడంతో ఆయన తన కుమార్తెకు కళ్యాణ్ దేవ్(Kalyan Dev)అనే వ్యక్తితో రెండవ వివాహం చేశారు.
అయితే కొంతకాలంగా రెండవ భర్తతో కూడా శ్రీజకు మనస్పర్ధలు ఉన్నాయని అయితే వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్న ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విధంగా శ్రీజ తన వ్యక్తిగత కారణాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.
"""/" /
ఇక తాజాగా శ్రీజ షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా సంథింగ్ ఈస్ కమింగ్( Something Is Coming ) అంటూ ఇన్స్టా స్టోరీ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇది చూసినటువంటి నేటిజన్స్ శ్రీజ ఇలాంటి పోస్ట్ చేశారంటే బహుశా ఈమె త్వరలోనే ఏదో శుభవార్త చెప్పబోతున్నారని అర్థం అంటూ కామెంట్ చేస్తున్నారు మరి శ్రీజ జీవితంలోకి ఏం రాబోతోంది ఈమె చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.
బహుశా ఈమె మూడో పెళ్లి గురించి చెప్పబోతున్నారా అంటూ కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!