వాట్సాప్ చాట్ ను బయటపెట్టేసిన శ్రీజ.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
TeluguStop.com
మెగా డాటర్ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల పేర్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న విషయం తెలిసిందే.
కళ్యాణ్ దేవ్,శ్రీజ విడివిడిగా ఉండటంతో వాళ్లు విడాకులు తీసుకుంటున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ విషయంపై ఇటు శ్రీజ కాని అటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించడం లేదు.
అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు.
మెగా ఫ్యామిలీలో శ్రీజ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్లు జరిగినా కూడా కళ్యాణ్ దేవ్ హాజరు కావడం లేదు.
దీనితో వారిద్దరి విషయంలో వస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. """/" /
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీజ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను చేసింది.
శ్రీజ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసిన ఒక స్క్రీన్ షాట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ స్క్రీన్ షాట్ లో తాను చెప్పిన విషయాలు, తన కూతురు చాటింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
తనకు జన్మనిచ్చిన తల్లికి గుడ్ మార్నింగ్ అంటూ ఇలా ఓ మెసెజ్ ను నివృత్తి పెట్టగా దానికి నవ్వుతున్న ఎమోజీని రిప్లైగా ఇచ్చింది శ్రీజ.
అయితే ఇలా ఎమోజీని షేర్ చేయడం నివృత్తికి నచ్చనట్టుంది.అమ్మా నేను నీకేం నేర్పించానో మరిచిపోయావా? ఆ ఎమోజీ నాకు నచ్చలేదు, బాగా లేదు అన్నట్టుగా మెసెజ్ పెట్టేసింది.
మళ్లీ రిప్లై పెట్టు అమ్మా అంటూ నివృత్తి మెసెజ్ పెట్టేసింది. """/" /
అప్పుడు శ్రీజ మేం అంతా కూడా పాతకాలం మనుషులం కదా? అని రిప్లై ఇవ్వడంతో.
హహహహ అని నివృత్తి నవ్వుతున్నట్టుగా మెసెజ్ పెట్టేసింది.అలా మొత్తానికి ఈ తల్లీకూతుళ్లు పొద్దుపొద్దున్నే చాటింగ్ చేసేసుకున్నారు.
ఇప్పుడు శ్రీజ తన పిల్లలు నివృత్తి, నవిష్క లతో కలిసి ఉంటోంది.కాగా ఇటీవల శ్రీజ కూతురు నివృతి పుట్టినరోజు సందర్భంగా కూడా కళ్యాణ్ దేవ్ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయలేదు.
నాకు సమయం వస్తుంది…. అప్పుడే సమాధానం చెబుతా… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!